సెప్టెంబర్ 26వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కళింగపట్నం-సోలాపూర్ మధ్య తీరం దాటిన అన్నట్లుగా వాతావరణశాఖ తెలుపుతోంది. ఇది పశ్చిమంగా పయనిస్తూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా వైపుగా వచ్చేందుకు అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలియజేసింది. ఇదే తరుణంలో ప్రజలు తుఫాను సమయంలో ఏం చేయకూడని పనులు చేయవలసిన పనులు ఇవే..


1). మన ఇంటి గోడలు సరిగ్గా ఉన్నావో లేవో చూసుకోవాలి. ఏదైనా చీలికలు ఉంటే సిమెంట్ వేయించుకోవాలి.

2). మన ఇంటి చుట్టూ వాతావరణం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. పెద్ద పెద్ద చెట్లను ఇంటి పరిసరాల్లో ఉంచకూడదు.

3). ఇంటి లోపలి వస్తువులు గాలికి ఎగిరి బయటికి రాకుండా జాగ్రత్తగా తలుపులు వేసుకోవాలట.

4). కేవలం రేడియోలోనే వాతావరణ హెచ్చరికలను వింటూ ఉండాలి.

5). ఏదైనా లోతట్టు ప్రాంతంలో ఉండే వారు ముందు జాగ్రత్తగా ఏదైనా ఎత్తైన ప్రదేశంలోకి వెళ్లి ఉండటం మంచిది. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నవారు కూడా అప్రమత్తంగా ఉండటం మంచిది.

6). వర్షాలు ఎక్కువగా పడే సూచన ఉంది అందువలన ఇంట్లో అదనపు ఆహారం పొందుపరచి పోవాలి.

7). వరద నీరు ఎక్కువగా వచ్చే పరిసరాల విలువైన వస్తువులను ఏదైనా సురక్షిత ప్రదేశంలకు తరలించు కోవాలి.

8).IMD సూచించిన మేరకు సురక్షితమైన ప్రదేశం లోనే ఉండడం మంచిది అన్నట్లుగా తెలియజేస్తోంది.

9). వర్షం పడుతున్నప్పుడు రోడ్లపై కార్లు, బండ్లు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి.

10). ఏదైనా సమయాల్లో మీరు భయభ్రాంతులకు గురి అయితే పోలీసులకు సమాచారం అందించడం మంచిది.

తుఫాను సమయాల చేయకూడని పనులు..
1). ఎవరైనా చెప్పే ఎటువంటి మాటలను నమ్మకూడదు.. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సమాచారాన్ని తెలుసుకొని నమ్మాలి అన్నట్లుగా IMD త తెలియజేస్తుంది.

2). మీరు ఉన్న ప్రాంతం సురక్షితం అనిపిస్తే అక్కడినుంచి వెళ్లాల్సిన అవసరం లేదు.

3). రోడ్లపై ఉండేటువంటి కరెంటు స్తంభాల ను ముట్టుకోకూడదు. అంతే కాకుండా ఏదైనా ఎత్తైన చెట్ల కింద ఉండకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: