సాధారణంగా ఎవరైనా చనిపోతే ఇక అంతిమయాత్రకు బంధుమిత్రులు స్నేహితులు లాంటి వారు హాజరవుతూ ఉంటారు. అదే సమాజంలో అందరికీ ఎంతగానో సేవ చేసి ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి.. ఎన్నో సోషల్ సర్వీసులు చేసి ఎంతో మందిని ఆదుకున్న వ్యక్తి.. సభ్య సమాజంలో ఒక గొప్ప ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న వ్యక్తి చనిపోతే ఎంతోమంది అభిమానులు ప్రజలు కూడా భారీగా తరలి వచ్చి అంతిమయాత్ర నిర్వహిస్తూ ఉంటారు. ఇలా ఇటీవల కాలంలో ఎంతోమంది ప్రముఖులు చనిపోయిన సమయంలో భారీ రేంజ్ లో అభిమానులు శ్రేయోభిలాషులు బంధువులు వచ్చి అంతిమయాత్ర నిర్వహిస్తూ ఉండటం చూస్తూ ఉంటాం. ఇలా అంతిమయాత్ర నిర్వహిస్తున్న సమయంలో రహదారులు మొత్తం  అంతిమ యాత్రకు వచ్చిన జనాలతో నిండిపోయి ఉంటాయి.



 అయితే సమాజంలో బాగా పేరు ఉన్న వ్యక్తి చనిపోతే ఇలాంటిదే జరుగుతూ ఉంటుంది. కానీ ఒక యాచకుడు చనిపోతే ఏం జరుగుతుంది. యాచకుడు అంటే దాదాపుగా ఎవరూ ఉండరు కాబట్టి ఆ శవాన్ని ఎవరికీ తెలియకుండా ఇక ప్రభుత్వ అధికారులు దహనం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక యాచకులకు అంతిమయాత్ర లాంటివి కూడా దాదాపు ఉండవు అని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు  అతను ఒక యాచకుడు కానీ అతను చనిపోతే అంతిమయాత్రకు మాత్రం ఊహించనంత మంది జనాలు తరలివచ్చారు.


 కర్ణాటకలోని బళ్ళారి లో ఈ ఘటన చోటు చేసుకుంది  ఓ యువకుడి అంతిమ యాత్రకు వేల సంఖ్యలో జనం హాజరు అవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. బసవ అలియాస్ హుచ్చా బాస్య అనే యువకుడు ఉన్నాడు. అయితే చుట్టుపక్కల వాళ్ళు బిక్షం పెడితే దానితోనే జీవనం సాగిస్తూ ఉన్నాడు. కానీ యాచకుడు విషయంలో చుట్టుపక్కల వారందరికీ కూడా ఒక అభిప్రాయం ఉంది.. యాచకుడికి బిక్షం పెడితే మంచి జరుగుతుందని స్థానికులు నమ్ముతూ ఉంటారు. అందుకే చాలామంది ఇతడిని ఇంటికి పిలిచి మరి అన్నం పెట్టేవారు. అయితే ఈ యాచకుడికి ఎన్ని డబ్బులు ఇవ్వాలని అనుకున్నప్పటికీ అతను మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి మాత్రమే తీసుకునే వాడట. ఇక ఇటీవల అనారోగ్యం బారిన పడి చనిపోయిన ఈ యాచకుడికి అంతిమయాత్రకు స్థానికులు అందరూ కూడా భారీ మొత్తంలో తరలి రావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: