యుద్ధం అనేది ప్రపంచంలోని ఎన్నో రకాల ప్రాంతాలను నాశనం చేస్తున్నప్పటికీ, డాక్టర్లు మాత్రం అక్కడ కూడా ప్రజల జీవితాలను సురక్షితంగా ఉంచుకోవాలని చూస్తారు. ఉక్రెయిన్‌ దేశానికి చెందిన ఓ వీడియో ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. రష్యా దేశపు దాడిని ఎదుర్కొంటున్న కీవ్‌లోని ఆసుపత్రిలో డాక్టర్ల బృందం చీకట్లో ఎమర్జెన్సీ లైట్‌ వెలుతురులో ఓ శిశువుకు గుండె ఆపరేషన్ చేస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. వైద్య సహాయకులు ఎమర్జెన్సీ లైట్‌ను రెడీ చేశారు. డాక్టర్లు కేవలం ఆ వెలుతురులోనే చాలా కష్టపడి శస్త్రచికిత్స చేశారు.. రెండు గుండె కవాట మార్పిడి ఆపరేషన్లు వారు చేశారు. ఇదంతా కూడా ఓ డాక్టరే స్వయంగా వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ విపరీతంగా వైరల్‌ అవుతోంది.ఇక ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి అందరికీ తెలుసు. ఈ యుద్ధం అనేది ప్రతి ఒక్క వ్యవస్థపై ప్రభావితం చేసింది. అయితే, ఈ కష్ట సమయంలో కూడా డాక్టర్లు తమ బాధ్యతను చాలా చక్కగా నిర్వహించారు. 


ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ఆసుపత్రిలో రష్యన్ క్షిపణుల కారణంగా నగర వ్యాప్తంగా  కరెంటు ఆగిపోయింది. అయితే కరెంటు లేకపోయినప్పటికీ ఉక్రెయిన్ డాక్టర్లు ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ ని చేస్తూనే ఉన్నారు.ఇక వైరల్ అవుతున్న ఈ వీడియో చూశాక యుద్ధాన్ని ఎదుర్కొంటున్న ప్రజల పరిస్థితి ఏంటో మనం అంచనా వేయొచ్చు. రెండు దేశాల మధ్య యుద్ధ ప్రభావం కేవలం సైనికులపైనే కాదు అక్కడ వున్న ప్రతి వ్యక్తిపైనా కూడా పడుతుంది.ఉక్రెయిన్‌ దేశంపై రష్యా క్షిపణి దాడి సమయంలో కీవ్‌లోని గుండె సర్జరీలు ఆగిపోవడం జరిగింది. కానీ, చిన్నారికి అత్యవసర గుండె ఆపరేషన్ చేశారు. అని సోషల్ మీడియా వినియోగదారు ట్విట్టర్‌లో ఈ వీడియోని పోస్ట్ చేశారు. ఎమర్జెన్సీ లైట్‌ మసక వెలుతురులో డాక్టర్లు ఆపరేషన్ చేయడాన్ని వీడియోలో చూడవచ్చు. నిజంగా చాలా గ్రేట్ కదా.. ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: