ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఒక్కోసారి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి సక్సెస్ సొంతమైతే ఒక్కోసారి ఫెయిల్యూర్ కన్నీళ్లను మిగులుస్తుంది. ప్రతి మనిషికి సక్సెస్ సంతోషాన్ని పంచితే, వైఫల్యం మాత్రం కుంగదీస్తుంది. నేటి యువత ఓటమిని అంగీకరించలేకపోతున్నారు. చిన్న చిన్న విషయాల్లో ఓటమిపాలయినా డిప్రెషన్ కు లోనవుతున్నారు. తమపై తాము పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి జీవిస్తున్నారు. 
 
ఈ బాధ, నిస్సహాయత అంతకంతకూ పెరిగే మాత్రం విజయం సాధించడం సాధ్యం కాదు. ఇలాంటి సందర్భాల్లో మనోస్థైర్యాన్ని అలవరచుకుంటే సక్సెస్ సులభంగా సొంతమవుతుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదుర్కోగలమనే నమ్మకం మనపై మనకు ఉండాలి. మనపై మనకు నమ్మకం ఉంటే మాత్రమే చేసే ఏ పనిలోనైనా సక్సెస్ సాధించగలగడం సాధ్యమవుతుంది. మనపై మనకు నమ్మకం లేకపోతే ఏ పనిలోను విజయం సాధించలేం. 
 
ఏ పనిలోనైనా మొదలుపెట్టేముందు పూర్తి నమ్మకం ఉంటే మాత్రమే ఆ పనిని మొదలుపెట్టాలి. స్నేహితులు, బంధువులు చెప్పారని ఇష్టం లేకపోయినా పనులను మొదలుపెడితే సక్సెస్ కంటే ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. నిర్దేశించుకున్న పని కోసం 100 శాతం కృషి చేయాలి. ఈ విధంగా శ్రమిస్తే సక్సెస్ తప్పక సొంతమవుతుంది. 
 
ఏ రంగంలోనైనా పెట్టుబడులు పెట్టే ఉద్దేశం ఉంటే అనుభవం ఉన్న రంగాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. తెలియని రంగాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఒకే విధంగా చూడాలి. కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్స్ సక్సెస్ కు పునాదులు అవుతాయని గుర్తుంచుకోవాలి. తొలి ప్రయత్నంలో ఫెయిల్యూర్ చవిచూసిన ఎంతోమంది తరువాత ప్రయత్నాల్లో సక్సెస్ సాధించిన ఘటనలు కోకొల్లలు. మనోస్థైర్యాన్ని పెంపొందించుకుని మనల్ని మనం నమ్మితే విజయం తప్పక సొంతమవుతుంది.                               

మరింత సమాచారం తెలుసుకోండి: