కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనడానికి ఈయన నిలువెత్తు నిదర్శనం.. కేవలం పదవ తరగతి చదివి ప్రస్తుతం 750 కోట్ల టర్నోవర్ సాధించిన ఘనత కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. అలాంటి వారిలో సరిపల్లి కోటి రెడ్డి గారు ఒకరు.. కృషి పట్టుదలతో పేదరికం కూడా మాయమైపోతుంది అనడానికి ఈయన నిలువెత్తు నిదర్శనం. కేవలం పదవ తరగతి చదివి 750 రూపాయల జీతానికి నెలనెలా పనిచేసే ప్రస్తుతం 750 కోట్ల టర్నోవర్ కి చేరుకున్నారంటే ఆయన ఇంత పెద్ద స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడో చెప్పనక్కర్లేదు.. ఒక మామూలు వ్యవసాయ కుటుంబంలో పుట్టి పదవ తరగతి చదివి టేక్ దిగ్గజంగా మారారంటే ఆయన పట్టుదల కృషికి హాట్సాఫ్ చెప్పాల్సిందే.

 చాలామంది పెద్దపెద్ద చదువులు చదివి కూడా ఎక్కడ ఏ ఉద్యోగం దొరుకుతుందా అని ఇంటర్వ్యూలకు వెళ్తూ కాంపిటిటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. కానీ ఈయన మాత్రం కేవలం పదవ తరగతి చదువుకొని కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో  కంప్యూటర్ ప్రోగ్రామ్ ను నేర్చుకొని మెల్లిమెల్లిగా అన్ని నేర్చుకొని  ఆ తర్వాత కోటి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ ద్వారా ఒక వినూత్న ఆవిష్కరణతో ముందుకు సాగారు.. అలా క్రమక్రమంగా ఆయన ఎదుగుతూ ఇండియాలో ఈగుడి డిజిటల్ ఎడ్యుకేషన్ కో సిస్టం లిమిటెడ్, ఇండియా హెరాల్డ్ గ్రూప్ పబ్లిషర్స్ లిమిటెడ్, హెల్త్ కేర్ లేబరేటరీస్, స్నగర్ ప్రైవేట్ లిమిటెడ్, డీజెడ్ పే ప్రైవేట్ లిమిటెడ్, భారత్ ఇన్నోవేషన్ ల్యాబ్, క్లౌడ్ బ్లడ్, సేవా ఫౌండేషన్, కోటి ఫౌండేషన్,ఆర్గ్ వంటి ఎన్నో సంస్థలను స్థాపించి లక్షలాది మందికి ఉద్యోగాన్ని కల్పించి ఎంతో మందికి దగ్గరై వినూత్న ఆవిష్కరణలకు తెర లేపారు.

 అలా ఒక మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన కోటిరెడ్డి గారు ప్రస్తుతం 750 కోట్ల టర్నోవర్ కి చేరుకున్నారంటే ఆయన కృషి పట్టుదల ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.. ఆయన తన సంస్థలను ఎన్నో దేశాల్లో విస్తరించారు. అలాంటి సరిపల్లి కోటి రెడ్డి గారి జన్మదినం కావడంతో ఎంతోమంది ప్రముఖులు ఆయనకి విష్ చేస్తున్నారు.. కోటి రెడ్డి గారు ఆయురారోగ్యాలతో ఉండి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మనం కూడా కోరుకుందాం. ఇండియా హెరాల్డ్ తరఫున  "హ్యాపీ బర్త్ డే సరిపెల్లి కోటిరెడ్డి సార్"..

మరింత సమాచారం తెలుసుకోండి: