ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఆంపియర్, ఫైనాన్షియల్ కంపెనీ ఆటో వర్ట్ తో దేశంలో సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ఉత్పత్తులను మొదలు పెట్టేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఈ ఒప్పందంలో భాగంగా ఈవి యజమానులు కొత్త బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను ఎంచుకోవచ్చు అని తెలియజేశారు. అయితే ఇందుకు సంబంధించి మొదటగా బెంగుళూరు నగరంలో మాత్రమే వర్తింప చేసేటట్లుగా ప్రణాళికలు రచించారు. ఈ నిబంధన ప్రకారం కొత్తగా ఆంపియర్ ఎలక్ట్రికల్ స్కూటర్ లను సొంతం చేసుకోవడానికి మరింత సులువుగా మారింది.


అయితే ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ విధానం ద్వారా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనేందుకు అయ్యే ఖర్చు చాలా వరకు తగ్గిస్తుంది అని, అలాగే కొనుగోలుదారులకు ప్రత్యామ్నాయ ఎంపికను అందిస్తుందని తెలియజేశారు. ఇందులో భాగంగా కంపెనీ విడుదల చేసే మాగ్నస్ ప్రో మోడల్ ను రూ. 49,990 కొనుగోలు చేసుకోవచ్చు అన్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి కేవలం నెల రోజులకు రూ. 1990 అదనంగా చెల్లించాల్సిస్తే సరిపోతుందని తెలియజేశారు.

 

ఇకపోతే ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూం లో రూ. 73,990 గా ఉంది. కొత్త బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ద్వారా ఇతర వాహన ప్రయోజనాల పైన ఐదేళ్ల వారంటీ పొడిగించడంతో పాటు పూర్తి వాహన బీమా 24 నెలలకు సంబంధించి పూర్తి సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ బ్యాటరీ ప్లేస్మెంట్ వంటి వాటిపై అనేక రకాల తగ్గింపులతో పాటు ఇతరత్రా ప్రయోజనాలను కూడా అందించబోతున్నారు. ఇందుకు సంబంధించి కంపెనీ అధికారులు మాట్లాడుతూ ప్రత్యేకమైన బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్  ప్రణాళికలను మొదలుపెట్టడానికి ఆంపియర్ తోపాటు భాగస్వామ్యం కుదుర్చుకున్న ఆటో వర్ట్ టెక్నాలజీస్ తో కలవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. కొత్తగా  వినియోగదారులకు మరింత సరసమైన ధరకు ఎలక్ట్రికల్ స్కూటీలు అందించే విధంగా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: