ఇక అమెరికన్ ఎస్‌యూవీ స్పెషలిస్ట్ జీప్ (Jeep) భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ ఎస్‌యూవీ కార్ కంపాస్ (Compass) లో ఓ వార్షికోత్సవ ఎడిషన్ ను విడుదల చేసింది.దేశీయ మార్కెట్లో జీప్ కంపాస్ వార్షికోత్సవ ఎడిషన్  ధర వచ్చేసి రూ. 24.44 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది. జీప్ భారతదేశంలో తమ వ్యాపారాన్ని ప్రారంభించి మొత్తం 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ అమెరికన్ కంపెనీ తమ ఐకానిక్ కంపాస్ ఎస్‌యూవీలో ఈ కొత్త యానివర్స్‌రే ఎడిషన్ ను పరిచయం చేసింది.ఇక ఈ స్టాండర్డ్ జీప్ కంపాస్ తో పోల్చుకుంటే, ఈ కొత్త 2022 జీప్ కంపాస్ యానివర్స్‌రే ఎడిషన్ కొన్ని కాస్మెటిక్ ఇంకా ఫీచర్ అప్‌గ్రేడ్ లను కలిగి ఉంటుంది. అలాగే ముందుగా ఎక్స్టీరియర్ లో చేసిన మార్పుల విషయానికి వస్తే, కంపాస్ యానివర్సరీ ఎడిషన్ ఎస్‌యూవీ కార్ లో గ్రానైట్ క్రిస్టల్ ఫినిషింగ్‌తో కూడిన 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఇంకా న్యూట్రల్ గ్రే ఫినిష్ చేయబడిన సైడ్ మిర్రర్స్, బాడీ-కలర్ ఫెండర్ ఫ్లేర్స్ అలాగే యాక్సెంట్ కలర్ రూఫ్ రైల్స్‌  ఇంకా ఫ్రంట్ గ్రిల్ రింగులపై న్యూట్రల్ గ్రే ఫినిషింగ్ మొదలైన కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ప్రధానంగా కనిపిస్తాయి.


ఇక ఈ జీప్ కంపాస్ యానివర్స్‌రే ఎడిషన్ లో చేసిన ఈ కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ చిన్నవే అయినప్పటికీ, స్టాండర్డ్ మోడల్ తో పోల్చుకుంటే ఈ స్పెషల్ ఎడిషన్ కార్ ను కాస్త ఎక్కువ ప్రీమియంగా కనిపించేలా చేస్తాయి. ఇంకా ఈ మార్పులకు అదనంగా, జీప్ కంపాస్ వార్షికోత్సవ ఎడిషన్ ఎస్‌యూవీ ప్రత్యేకమైన ఐదవ వార్షికోత్సవ బ్యాడ్జింగ్‌ను కూడా కలిగి ఉంది. ఇది జీప్ కంపాస్ భారత మార్కెట్లో తన విజయవంతమైన ఐదు సంవత్సరాల ప్రయాణాన్ని కూడా గుర్తు చేస్తుంది.ఈ జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ ఎక్స్టీరియర్ లో కన్నా ఇంటీరియల్ చేసిన మార్పులు కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మార్పులలో లెదర్ సీట్లపై టంగ్‌స్టన్ యాక్సెంట్ స్టిచింగ్, బ్లాక్ హెడ్‌లైనర్, ఆటోమేటిక్ డిమ్మింగ్ రియర్-వ్యూ మిర్రర్ ఇంకా పియానో బ్లాక్ అలాగే యానోడైజ్డ్ గన్ మెటల్ ఇంటీరియర్ యాక్సెంట్‌లు కూడా ప్రధానంగా కనిపిస్తాయి. జీప్ కంపాస్ ఎస్‌యూవీ స్టాండర్డ్ వేరియంట్‌తో పోల్చితే, ఈ కొత్త మార్పులన్నీ కూడా జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ ఎస్‌యూవీలో కొంచెం ఎక్కువ ప్రీమియంగా ఇంకా ఈ కారును మరింత స్పెషల్‌గా కనిపించేలా చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: