తెలంగాణ‌లో రాజ‌కీయ వేడి రోజు రోజుకు ర‌గిలిపోతుంది. ముఖ్యంగా రైతుల కోసం టీఆర్ఎస్‌, బీజేపీలు ఓ వైపు మాట‌ల యుద్ధం న‌డుస్తున్న త‌రుణంలోనే ఇవాళ ఇందిరాపార్కులో సీఎం కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో మ‌హాధ‌ర్నా నిర్వ‌హిస్తున్నారు. మ‌రోవైపు  రైతులు పండించిన ధాన్యాన్ని ప్ర‌భుత్వం సేక‌రించాల‌నే డిమాండ్‌తో కాంగ్రెస్ నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్స్ నుంచి వ్య‌వ‌సాయ శాఖ క‌మిష‌న‌రేట్ వ‌ర‌కు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేయ‌నుంది.

ముఖ్యంగా టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఆధ్వ‌ర్యంలో ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతుంది. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌కు రైతులు పెద్ద ఎత్తున హాజ‌ర‌వ్వ‌నున్నారు. వ్య‌వ‌సాయ శాఖ క‌మిష‌న‌రేట్ వ‌ర‌కు ప్ర‌ద‌ర్శ‌న త‌రువాత రైతులు పండించిన ధాన్యాన్ని వెంట‌నే కొనుగోలు చేసి వారిని ఆదుకోవాల‌ని క‌మిష‌న‌ర్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేయ‌నున్నారు కాంగ్రెస్ నేత‌లు. టీఆర్ఎస్ ధ‌ర్నా నేప‌థ్యంలో యావ‌త్ తెలంగాణ అంతా హైద‌రాబాద్ న‌గ‌రంలోనే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ముఖ్యంగా  సీఎం కేసీఆర్ స్వ‌యంగా ధ‌ర్నాలో పాల్గొన‌డం హాట్ టాపిక్‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: