ఉద్ధవ్‌ ఠాక్రే.. శివసేన అధ్యక్షుడు.. శిందే తన నుంచి ఎమ్మెల్యేలను లాక్కొని ఏకంగా సీఎం సీటునే గుంజుకున్న తర్వాత ఇప్పుడు నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ ఎంపీలు కూడా తన నుంచి దూరం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే రాష్ట్రపతి ఎన్నికల విషయంలో స్టాండ్ మార్చేశారు.  పార్టీ ఎంపీలు సూచించినట్లుగా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని ఉద్దవ్  ఠాక్రే నిర్ణయించారు.


ఠాక్రే సారథ్యంలో నిన్న జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముర్ముకు మద్దతు ఇవ్వటాన్ని సమర్థించుకున్న శివసేన.. దీని అర్థం బీజేపీకి మద్దతు ఇచ్చినట్లు కాదంటోంది. ఠాక్రే తన నివాసంలో నిర్వహించిన ఎంపీల సమావేశంలో..... వారంతా ద్రౌపదీ ముర్ముకు మద్దతు ఇవ్వాలని కోరారు. మరోసారి సమావేశమైన శివసేన కోర్ కమిటీ కూడా ఎంపీలు కోరినట్లుగానే ముర్ముకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: