ఏపీ సీఎం జగన్ ఇవాళ ఖాతాల్లో డబ్బులు వేయనున్నారు. ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్న  సీఎం జగన్‌.. అక్కడే జగనన్న విద్యాదీవెన మూడో త్రైమాసిక నగదు బదిలీ చేయనున్నారు. ఈ విడతలో 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి విద్యా దీవెన నిధులను సీఎం జగన్ బదిలీ చేయనున్నారు.

తాడేపల్లి నుంచి బాపట్ల చేరుకోనున్న సీఎం జగన్‌.. బాపట్లలోనే నగదు బదిలీ చేయనున్నారు. సీఎం జగన్ విద్యా దీవెనతో పాటు అనేక విద్యా సంబంధిత పథకాల్లోనూ నగదు బదిలీ చేస్తున్నారు. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక వంటి పథకాల ద్వారా విద్యా రంగంలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడులను పునర్మిస్తూ వాటిలో అన్ని సౌకర్యాలు కలుగ జేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు  విద్యా దీవెన మూడో విడత నగదు బదిలీ చేస్తున్నారు. ఈ కార్యక్రమం తర్వాత సీఎం తాడేపల్లికి తిరుగు పయనం అవుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: