షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో భాగంగా ఉజ్బెకిస్థాన్ లోని సమర్ ఖండ్ లో వివిధ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో షహబాజ్ షరీఫ్ పుతిన్ ముందు నవ్వులపాలయ్యారు. ట్రాన్స్ లేటర్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇబ్బంది పడ్డారు. ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం ఆయనకు ఎంతకూ చేతకాలేదు. తడబడుతున్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ను చూసి పుతిన్ ముసిముసిగా నవ్వుకున్నారు.


ఈ సమావేశానికి ముందే పుతిన్ ఇయర్ ఫోన్స్ వంటి పరికరాన్ని చెవిలో పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. షహబాజ్ షరీఫ్ మాత్రం ఆ పరికరాన్ని పెట్టుకునేందుకు తెగ ఇబ్బంది పడ్డారు. ఆయన సహాయకుడు వచ్చి ఇయర్ ఫోన్స్ పెట్టి వెళ్లాక అది కాస్తా ఊడి పడిపోయింది. దీంతో షహబాజ్ సహాయకుడు మరోసారి వచ్చి పరికరాన్ని అమర్చారు. అయితే ఈ వీడియోను పాకిస్థాన్ లోని పీటీఐ పార్టీ నేత సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ క్రైమ్ మినిస్టర్ వరుసగా పాకిస్థాన్ కు తలవంపులు తెస్తున్నారని వెటకారంగా రాసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: