గతేడాది జనవరి – డిసెంబర్‌ మధ్యకాలంలో ఏపీకి రూ.45,217 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఏపీ ఉన్నత అధికారులు చెబుతున్నారు. 2022-23లో రూ.1.6లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యాయని ఏపీ ఉన్నత అధికారులు తెలిపారు. 2021-22లో ఎగుమతుల విలువ 1.43 లక్షల కోట్లు అని చెబుతున్నారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అది రూ.1.6లక్షల కోట్లు పెరిగిందని ఏపీ ఉన్నత అధికారులు వివ‌రించారు.

ఏపీ నుంచి బహుళ ఉత్పత్తులు, బహుళ దేశాలకు ఎగుమతులు ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేక దృష్టి పెట్టాల‌ని ఈ సందర్భంగా సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందేలా చూడాల‌ని సీఎం జగన్ అన్నారు.  పరిశ్రమల శాఖలో ఎంఎస్‌ఎంఈల కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ వారికి  ఆదేశించారు. దీని కోసం ఒక కార్యదర్శిని కూడా నియమించాలని సీఎం జగన్ వారికి సూచించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: