పశ్చిమ బెంగాల్ లో కరోనా ఏ మాత్రం ఆగలేదు. ఒక పక్క తుఫాన్ దెబ్బకు నానా ఇబ్బందులు ఇంకా పడుతున్న ఆ రాష్ట్రంలో ఇప్పుడు కరోనా కేసులు వేగంగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడ ప్రతీ రోజు కూడా వందల కేసులు నమోదు అవుతున్నాయి అని లెక్కలు చెప్తున్నాయి.

 

తాజాగా బెంగాల్ లో దాదాపు 500 కేసుల వరకు నమోదు అయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో ఈ రోజు మరో 440 కరోనా కేసులు & 10 మరణాలు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9768 వద్ద ఉందని... వీటిలో 3988 మంది డిశ్చార్జ్ అయ్యారు అని మొత్తం ఇప్పటి వరకు 442 మంది మరణించారు అని రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: