ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల విషయంలో సీఎం వైఎస్ జగన్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుతో పాటుగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ కార్యక్రమం పని తీరుని నేరుగా తెలుసుకునే ఆలోచనలో ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ప్రభుత్వ వర్గాల నుంచి కొన్ని వార్తలు వస్తున్నాయి. సిఎం ఇప్పుడు కొన్ని టీం లను క్షేత్ర స్థాయిలో అమలు చేసే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు.

 

వారితో నేరుగా సిఎం మాట్లాడే అవకాశం ఉందని, మండలాలు, జిల్లాలు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా టీం లను ఏర్పాటు చేస్తారని అంటున్నారు. దీనిపై త్వరలోనే ఒక ప్రకటన వచ్చే అవకాశ౦ ఉందని అంటున్నారు. ఆగస్ట్ నుంచి సిఎం గ్రామాల పర్యటనకు వెళ్తున్నారు. ఈ లోగా ఈ టీంల ఏర్పాటు ఉంటుంద‌ని స‌మాచారం. వీరి ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా కూడా నియోజ‌క‌వ‌ర్గాల‌కు నిధులు విడుదల చేస్తార‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: