హైదరాబాద్ లో వర్షం దెబ్బకు లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా జలమయం అయ్యాయి. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. పురానాపూల్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కొన్ని చోట్ల వాహనాలు అన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. వరద పోయింది అనుకున్నా సరే కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ ఇళ్ళల్లో వరద నీరు చేరింది. హిమాయత్ సాగర్ కి 10 గేట్లు ఎత్తేసారు.

చాదర్ ఘాట్ సహా కొన్ని ప్రాంతాల్లో వంతెనల మీద నుంచి నీరు ప్రవహిస్తుంది. కోటి నుంచి దిల్ షుఖ్ నగర్ వెళ్ళే రోడ్లను మూసి  వేసారు అధికారులు. కోటి నుంచి  మలక్ పేట వెళ్ళే రోడ్లను కూడా మూసి వేసారు. కొన్ని చోట్ల వరదలకు నిత్యావసర వస్తువులు పాడైపోవడంతో తినడానికి తిండి కూడా లేకుండా పోయింది. మళ్ళీ భారీ వర్షం పడే అవకాశం ఉండవచ్చు అని అధికారులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: