దసరా, దీపావళి, ఈద్, గురునానక్ జయంతి, క్రిస్ట్‌మస్ అంటూ వరుసగా పండుగలు వస్తున్న వేళ అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రజలను ప్రధాని సుతిమెత్తగా హెచ్చరించారు. మంగళవారం (అక్టోబర్ 20) సాయంత్రం 6 గంటలకు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మన కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా తీవ్ర విషాదాన్ని నింపుతుందని తెలిపారు. దేశం నుంచి కరోనా వైరస్ వెళ్లిపోయిందనే భావన రానీయొద్దని, ఇంకా అది మనల్ని వీడలేదని అన్నారు. బయటకి వస్తే మాస్కు పెట్టుకోవడం, ఇతర కొవిడ్-19 నిబంధనలను పాటించడం మరచిపోవద్దని సూచించారు.

 ‘ఈ రోజు 6 గంటలకు మీకో విషయం చెబుతా..’ అంటూ మోదీ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ట్వీట్ చేశారు. దీంతో ప్రధాని ఏం చెబుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: