దుబ్బాక ఉప ఎన్నికల విషయంలో పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. తాజాగా కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేసారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోలీస్ ల పక్షపాత వైఖరి, అధికార దుర్వినియోగం కనిపిస్తోంది అని అన్నారు. బీజేపీ, టిఆర్ఎస్ డబ్బులతో గెలువాలనే కుట్ర చేస్తున్నాయి అని మండిపడ్డారు.

టిఆర్ఎస్ వందల కోట్లు విచ్చలవిడిగా పంచుతోందని  మండిపడ్డారు. పోలీస్ లు ఇప్పటివరకు అధికార పార్టీ డబ్బులు ఒక్క రూపాయి కూడా పట్టుకోలేదని అన్నారు. పోలీస్ ల పక్షపాత వైఖరి స్పష్టం అవుతోందని విమర్శించారు.  ఓ పార్టీ అభ్యర్థి ఇంట్లో పోలీస్ లే డబ్బులు పెడుతున్నట్లు వీడియో లు వస్తున్నాయన్నారు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని పోలీస్ ల వల్ల దుబ్బాకలో ఎన్నికలు ఫెయిర్ గా జరిగే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: