దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇప్పుడు నగదు వ్యవహారం కాస్త హాట్ టాపిక్ అయింది. ఏ మలుపు తిరుగుతుందో అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం బిజెపి, వర్సెస్ తెరాస గా యుద్ధం మారింది.  తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పోలీసుల తీరుపై సీరియస్ అయ్యారు. సిద్ధిపేట పోలీసులు వ్యవహరించిన తీరుపై  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి... పోలుసుల తీరు పై  రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ డీజేపీ కి ఆదేశాలు జారీ చేసారు.

 సెర్చ్ వారెంట్ లేకుండా సివిల్ డ్రెస్సుల్లో పోలీసులు ఎందుకు వచ్చారని ఆయన నిలదీసారు.  ఇప్పటికే సీపీ తీరుపై తెలంగాణ రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు. దుబ్బాక ఉప ఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: