నీటిపై నుంచే టేకాఫ్, ల్యాండింగ్ అవుతూ పర్యటకులకు సరికొత్త అనుభూతిని అందించే సీ ప్లేన్ సర్వీస్ దేశంలో అందుబాటులోకి రానుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్- కేవడియా మధ్య ఈ సేవల్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు.అహ్మదాబాద్‌లోని సబర్మతి నది నుంచి సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహం వరకు చక్కర్లు కొడుతూ నీటిపై నుంచి టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే సీ-ప్లేన్‌ను మాల్దీవులలోని మాలే నుంచి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తెప్పించింది.


ట్విన్ ఒట్టెర్ 300 మోడల్ ఫ్లైట్ అయిన ఈ సీ-ప్లేన్... గంటకు 290 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో సిబ్బంది సహా 19 మంది ప్రయాణించేందుకు వీలుంది. ప్రయాణికుల కోసం 14 సీట్లు ఏర్పాటు చేశారు. ఏరియల్ సర్వే తరహా కార్యక్రమాల కోసం నెమ్మదిగా నడిపితే 4 గంటల పాటు ఎగరగలదు. వేగంగా నడిపితే 2 గంటలపాటు విహరించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: