కరోనా వైరస్ సినీ పరిశ్రమకు దడ పుట్టిస్తుంది. తాజాగా హీరో రాజశేఖర్ కుటుంబం కూడా కరోనా బారిన పడిన విషయం అందరికి తెలిసిందే. రాజశేఖర్ భార్య జీవితకు కరోనా నుండి కోలుకోవడంతో ఆమెను వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె హోం ఐసొలేషన్ లో ఉన్నారు. రాజశేఖర్ మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు రావడంతో అందరూ షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం బాగుందని ఆయన కుమార్తె శివాత్మిక తెలిపారు. డాడీ కోలుకుంటున్నారని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

హైదరాబాదులోని సిటీ న్యూరో ఆసుపత్రి బృందం తన తండ్రి ఆరోగ్యం కుదుటపడటానికి ఎంతో కృషి చేస్తోందని ఆమె వెల్లడించారు. దీంతో పాటు సిటీ న్యూరో ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ను షేర్ చేశారు. రాజశేఖర్ కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోంది. వైద్యుల బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. హై ఫ్లో ఆక్సిజన్ ను ఆయనకు అందిస్తున్నాం' అని బులెటిన్ లో డాక్టర్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: