చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితం సెటిల్ అయినట్టే అని భావిస్తూ ఉంటారు. అందుకోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎలాంటి విషయాల్లో కూడా తలదూర్చే ప్రయత్నం చేయరు. ఉద్యోగం వచ్చిన తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలి. కాని ఒక వ్యక్తి మాత్రం జీవితం నాశనం చేసుకున్నాడు. కామారెడ్డి పట్టణ సిఐ జగదీష్ సస్పెండ్ అయ్యారు.

ఈ మేరకు నిజామాబాద్ రేంజ్ ఐజి ఉత్తర్వులు జారీ చేసారు. ఐపీఎల్ బెట్టింగ్ విషయంలో 5 లక్షల డిమాండ్ కేసులో సిఐ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ... ఆయనను ఆధారాలతో పట్టుకుంది. సోదాలలో ఆధారాలతో సహా సిఐ పట్టుబడటంతో అరెస్ట్ చేసి రిమాండుకు తరలించిన ఏసీబీ అధికారులు... దీనిపై విచారణ చేస్తున్నారు. దాంతో సిఐపై సస్సెన్షన్ వేటు వేస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: