ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పీడ్ పెంచారు. తాజాగా ఎన్నికల విధుల్లో వాలంటీర్ల జోక్యంపై ఆయన ఆంక్షలు విధించారు. రాజకీయ పార్టీల నేతలతో ఆయన నేడు సమావేశం అవుతున్నారు. నామినేషన్ వేసి మరణించిన అభ్యర్ధుల స్థానంలో కొత్త నామినేషన్ వేయించాడంపై ఇప్పుడు చర్చ జరగనుంది.

పలువురు అగ్ర నేతలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశమవుతున్నారు. ఇక నామినేషన్ వేయకుండా బలవంతం చేసారు అనే ఆరోపణల నేపధ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందు అనేక ఫిర్యాదులు ఉంచాయి రాజకీయ పార్టీలు. దీనిపై కూడా చర్చ జరుగుతుంది. ఇక ఈ సమావేశం తర్వాత నిమ్మగడ్డ తీసుకునే నిర్ణయంపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. పంచాయితీ రాజ్ శాఖ అధికారులతో కూడా నిమ్మగడ్డ రమేష్ సమావేశం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: