తమిళనాడు, కేరళ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు బిజెపి సీరియస్ గా ఉంది. ఈ ఎన్నికల్లో ఎలా అయినా సరే గలవాలని పట్టుదలగా వ్యవహరిస్తుంది ఆ పార్టీ. రాజకీయంగా సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపధ్యంలో తమిళనాడులో ఎన్నికల ప్రచారం కోసం స్టార్ లను దించే ప్రయత్నం చేస్తుంది. తమిళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ బాలీవుడ్‌ మాజీ హీరోయిన్, బిజెపి ఎంపీ హేమమాలిని ప్రచారం చేస్తారు.

ఆమె నాలుగు రోజులు తమిళనాడులో ప్రచారం నిర్వహిస్తారు. కీలక నేతల నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం చేస్తారు. అయితే ఏయే జిల్లాల్లో ఆమె పర్యటన చేస్తారనేది తమిళనాడు రాష్ట్ర పార్టీ ఇంకా ప్రకటించలేదు. అన్నాడిఎంకేతో కలిసి బిజేపి రంగంలోకి దిగింది. కాని తమిళనాట రాష్ట్ర ప్రభుత్వంపై సానుకూలత ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: