ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ క‌ర్ఫ్యూను మరింత టైట్ చేయాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. తాడేప‌ల్లి క్యాంప్ ఆఫీసులో అధికారులు, మంత్రులతో చ‌ర్చించిన అనంత‌రం సీఎం జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీలో క‌రోనా క‌ర్ఫ్యూను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పెంచుతూ సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఫ‌లితాలు రావాలంటే నాలుగు వారాలు క‌ర్ఫ్యూ ఉండాల‌ని సీఎం అభిప్రాయ‌పడ్డారు.   గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెర‌గ‌కుండా జాగ్ర‌త్తుల తీసుకోవాల‌ని ఆదేశించారు. కాగా కరోనాతో త‌ల్లిదండ్రులు చనిపోతే వారి పిల్ల‌ల్ని ఆదుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ సూచించారు. వారిపేరుమీద కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చులకోసం వచ్చేలా ఆలోచనలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.  వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండ‌కుండా చూసేలా ప్ర‌తిపాద‌న‌లు ఉండాల‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: