క్రికెట్ ప్రేక్షకులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. కాసేపటి క్రితం మొదలైన ఈ మ్యాచ్ లో కివీస్ బౌలర్లను మన ఓపెనింగ్ ద్వయం సమర్ధవంతంగానే ఎదుర్కొంటుంది అని చెప్పాలి. గిల్ కి ఇంగ్లాండ్ పిచ్ లు కొత్త అయినా సరే కాస్త భయపడకుండానే ఆడుతున్నాడు. కివీస్ పేస్ బౌలింగ్ ని సమర్ధవంతంగానే ఎదుర్కొంటున్నాడు.

ఇక ఇద్దరి బలాలు ఒకసారి చూస్తే రోహిత్ పుల్ షాట్ లు బాగా ఆడటమే కాకుండా షార్ట్ పిచ్ బాల్స్ ని ఏ మాత్రం కంగారు లేకుండా ఎదుర్కొంటాడు. ఇక స్పిన్ విషయంలో రోహిత్ లో ఏ మాత్రం ఆందోళన కనపడదు. గిల్ విషయానికి వస్తే... బ్యాక్ ఫుట్ డామినేషన్ ఎక్కువగా ఉండటమే కాకుండా లెఫ్ట్ ఆర్మ్ పేస్ బాగా ఎదుర్కొంటాడు. స్క్వేర్ వికెట్ పై ఆధిపత్యం ఎక్కువ.

మరింత సమాచారం తెలుసుకోండి: