దేశం లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని అనుకునేలోపే మళ్ళీ ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కొత్త కొత్త వేరియంట్లు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్ లాంటి వేరియంట్లు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఒకే వ్యక్తి రెండు వేరియంట్ ల బారినపడటం ఆందోళనకరంగా మారింది. అస్సాంకు చెందిన ఓ మహిళా డాక్టర్ ఒకేసారి రెండు వేరియంట్ ల బారిన పడింది. ఆమెకు పరీక్షలు నిర్వహించగా ఆల్ఫా మరియు డెల్టా వేరియంట్లను ఆమె శరీరంలో గుర్తించారు.

దీనిపై సీనియర్ వైద్యనిపుణులు శాస్త్రవేత్త బిజే బోర్క రోటీ స్పందించారు. రెండు వేరియంట్ల బారిన పడిన లక్షణాలు మాత్రం సాధారణంగానే ఉంటాయని వెల్లడించారు. ఒక వేరియంట్ బారిన పడితే ఎలా ఉంటాయో లక్షణాలు అలాగే ఉంటాయని చెప్పారు. అంతే కాకుండా దీని వల్ల ప్రమాదం ఏమీ ఉండదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అని స్పష్టం చేశారు. తాము గత నెల రోజులుగా బాధితురాలిని పరిశీలిస్తున్నామని ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. అంతేకాకుండా ఇప్పటికే ఆమెకు పూర్తి వాక్సినేషన్ అందించామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: