ఈ వార్త విని మీరు పండుగ చేసుకోవచ్చు..లేదా ఈ ఉత్త‌ర్వు చూపి మీరు హాయిగా న్యాయ స్థానాల ఎదుట ఠీవిగా నిల్చోవ‌చ్చు..అవును!గాళ్ ఫ్రెండ్ ను 498 ఏ సెక్ష‌న్ కింద విచారించేందుకు లేద‌ని ఏపీ హైకోర్టు ఓ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వు జారీ చేసింది. ఇటీవ‌ల నెల్లూరులో జ‌రిగిన ఓ ఘ‌ట‌న ఇందుకు దారి తీసింది. దీంతో బాధితురాలు హై కోర్టును ఆశ్ర‌యించి త‌న‌కు న్యాయం చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. త‌న‌పై ఓ వివాహిత ఫిర్యాదు మేర‌కు పోలీసులు తీ సుకోవాల‌నుకుంటున్న చ‌ర్య‌లేవీ అనుమతించ‌కూడ‌ద‌ని కోరారామె..తానూ, ఫిర్యాదు చేసిన మ‌హిళ భ‌ర్త స‌న్నిహితంగా మెలుగుతున్నామ‌న్న ఆ రోప‌ణ‌పై వివాహేత‌ర బంధం ఒక‌టి అంట‌గ‌ట్టి త‌న‌పై కేసు బ‌నాయించ‌డం త‌గ‌ ద‌ని ఆమె న్యాయ మూర్తి ఎదుట గోడు వినిపించారు.ఈ కేసులో సుప్రీం తీర్పుల‌ను ప్ర‌స్తావిస్తూ భ‌ర్త స‌న్నిహిత వ‌ర్గం లో గాళ్ ఫ్రెండ్ ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే అవ‌కాశం లేద‌ని,ఆమె అత‌ని బంధువు కాద‌ని అలాంట‌ప్పుడు ఆమె పై 498 ఏ ను ఎలా అప్లై చేస్తార‌ని ప్ర‌శ్నిస్తూ బాధితురాలి త‌ర‌ఫు న్యాయ‌వాది కొన్ని ఉదాహర‌ణ‌లు కోర్టు ముందర ఉంచారు.ఇవ‌న్నీ ప‌రిశీలించిన న్యా యమూర్తి మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసి, బాధితురాలికి ఊర‌ట‌ నిచ్చారు. అదేవిధంగా ఏ1 గా న‌మోద‌యిన వ్య‌క్తిపై విచార‌ణ కొన‌సాగించ‌వ‌చ్చ‌ ని స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: