హైదరాబాద్ గులాబ్ తుఫాన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు అందరూ కూడా ఇప్పుడు ఇళ్ళ నుంచి బయటకు రావాలి అంటే చాలు భయపడుతున్నారు. హైదరాబాద్ లో మరో రెండు మూడు రోజులు భారీ వర్షం పడే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. దీనితో డిజాస్టర్ బృందాలు అలెర్ట్ అయ్యాయి. మాన్సూన్ బృందాలను అలెర్ట్ గా ఉండమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఇక సిఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణా విద్యాశాఖ  కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్న ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి నిన్న ఒక ప్రకటన చేసారు. తిరిగి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని ఆమె మీడియాకు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts