ఏపీలో టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఈ దాడులకు సంబంధించి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు... సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఈ దాడులపై ఆయన నిరసనకు కూడా దిగాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నేతలతో సుదీర్ఘ మంతనాలు నిర్వహించిన చంద్రబాబు నాయుడు... రేపు ఉదయం 8 గంటల నుంచి 36 గంటల పాటు దీక్షకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు.

శుక్రవారం రాత్రి 8 గంటల వరకు దీక్షకు దిగుతున్న చంద్రబాబు... పార్టీ కేంద్ర కార్యాలయంలో దీక్ష చేయాలని నిర్ణయించారు. న్యాయ నిపుణులతో రెండు గంటల నుంచి చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. పార్టీ క్యాడర్ కు దగ్గరగా ఉండాలని నాయకులకు ఆదేశాలు ఇచ్చారని సమాచారం. ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని సూచనలు చేసారు చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: