రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ హైద‌ద్‌గూడలోని న్యూఫ్రెండ్స్‌కాల‌నీలో ఉన్న‌టువంటి కొండ‌ల్‌రెడ్డి అపార్టుమెంట్ స‌మీపంలో ఆడుకుంటున్న  అనీష్ అనే బాలుడు కిడ్నాప్‌కు గురైన విష‌యం విధిత‌మే. తాజాగా ఇంటి వెనుకాల ఉన్న  చెరువులోనే అనీష్ మృత‌దేహం ల‌భ్యం అయింది. దీనికి సంబంధించి  పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.
 
ఇప్ప‌టికే పోలీసులు చుట్టుప‌క్క‌ల ఉన్న  ప్రాంతాల‌న్నీ జ‌ల్లెడ ప‌ట్టారు.  నిన్న మ‌ధ్యాహ్నం అదృశ్య‌మైన అనీష్ విగ‌త‌జీవిగా క‌నిపించాడు. బాలుడి మృత‌దేహం చెరువులో  ల‌భ్య‌మ‌వ్వ‌డంతో  త‌ల్లిదండ్రులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు. గురువారం మ‌ధ్యాహ్నం అదృశ్య‌మైన అనీష్ మృత‌దేహం అత‌ని ఇంటి వెనుక ఉన్న చెరువులోనే ల‌భ్య‌మైన‌ది. బిల్డింగ్ వెనుక ఉన్న చిన్న చెరువులో ప‌డిపోయాడు బాలుడు. ఊపిరాడ‌క మృతి చెందిన‌ట్టు తెలుస్తున్న‌ది. స్నానం చేసేందుకు వెళ్లి ప్ర‌మాద‌వ‌శాత్తు ప‌డిపోయిన‌ట్టుగా పోలీసులు ప్రాథ‌మికంగా గుర్తించారు. నిన్న‌టి నుంచి పోలీసులు 10 బృందాలుగా వెతక‌డం మొద‌లుపెట్టారు. తాజాగా మృత‌దేహం ల‌భ్య‌మ‌వ్వ‌డంతో త‌ల్లిదండ్రులు, స్థానికులు క‌న్నీరు మున్నీర‌వుతున్నారు. పోలీసులు అనీష్ మృతిపై ద‌ర్యాప్తు చేప‌ట్టి త్వ‌ర‌లోనే వివ‌రాలు వెల్ల‌డిస్తాం అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: