ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని తిరుప‌తి శ్రీ‌కృష్ణ‌న‌గ‌ర్‌లో ఓ వింత అయిన‌ ఘ‌ట‌న చోటు చేసుకుంది. భూమి లోప‌లి నుంచి సిమెంట్ రింగ్‌లు క‌లిగిన‌ ట్యాంక్ ఒక్క‌సారిగా పైకి వ‌చ్చింది. సిమెంట్ రింగ్‌ల‌తో  చేసిన ట్యాంకును శుభ్రం చేస్తూ ఉండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ది. స్వ‌ల్ప‌గాయాలు త‌గిలి ఓ మ‌హిళా ఈ ఘ‌ట‌న‌లో బ‌య‌ట‌ప‌డింది. దాదాపు 25 రింగ్‌ల‌తో వేసిన సిమెంట్ ట్యాంకు  ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా 18 సిమెంట్ రింగ్‌లు బ‌య‌టికి వ‌చ్చాయి. భూమిపైకి వ‌చ్చిన రింగ్‌ల‌ను చూసి స్థానికులు ఆశ్చ‌ర్యపోయారు. గ‌త కొద్ది రోజుల నుండి ఏపీ  వ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం విధిత‌మే.

ముఖ్యంగా క‌డ‌ప‌, నెల్లూరు, అనంత‌పురం, చిత్తూరు జిల్లాలో భారీ వ‌ర్షాలు కురిసి అత‌లాకుత‌లమై.. ఎంతో మంది గ‌ల్లంతు అయిన విష‌యం అందరికీ తెలిసిన‌దే. అదేవిధంగా తిరుప‌తిలో భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో ప‌లు ప్రాంతాలు నీట మునిగిపోయి ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేసిన విష‌యం విధిత‌మే. ఈ త‌రుణంలోనే ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో అంద‌రూ ఆశ్య‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. తిరుప‌తి కృష్ణాన‌గ‌ర్‌లో చోటు చేసుకున్న  ఈ వింత ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. మరింత సమాచారం తెలుసుకోండి: