ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కొవిడ్ నియంత్రణ చర్యల దృష్ట్యా మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనాన్ని నిలిపేశారు.  దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈవో ఎస్.లవన్న తెలిపారు. వీటితో పాటు  అన్న ప్రసాద వితరణ, పాతాళ గంగ లో పుణ్య స్నానాలు కూడా తాత్కాలికంగా నిలిపేశారు. రోజుకు 4 విడతల్లో  సామూహిక అభిషేకాలు నిర్వహిస్తున్నామని ఈవో లవన్న తెలిపారు.


శ్రీశైలంలో ఈ నెల 18 నుంచి ఆర్జిత సేవల టిక్కెట్లు ఆన్ లైన్ ద్వారా పొందాల్సి ఉంటుందని ఈవో లవన్న వివరించారు. శీఘ్ర, అతిశీఘ్ర దర్శనం టికెట్లు కూడా ఆన్ లైన్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కు కొవిడ్ వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని ఈవో ఎస్‌ లవన్న ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీశైలం వెళ్తే భక్తులు ఈ మార్పులు గమనించి తమ యాత్రలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: