లఖింపురి ఖేరీ.. ఈ పేరు కొన్నాళ్ల క్రితం మీడియాలో మారుమోగింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులపైకి కారు తోలి.. 8 మంది వరకూ రైతుల మరణానికి కారణమయ్యాడని ఓ కేంద్ర మంత్రి కొడుకుపై కేసు నమోదైంది. ఈ ఉత్తరప్రదేశ్‌ లఖింపూర్‌ ఖేరి ఘటన ప్రధాన నిందితుడైన  కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రా తాజాగా కోర్టులో లొంగిపోయారు. ఆశిష్‌ మిశ్రాకు అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను  ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసింది.


దీంతో ఆయనకు లొంగిపోవడం మినహా వేరే గత్యంతరం లేకపోయింది. అందుకే ఆయన స్వయంగా  లఖింపుర్‌ జిల్లా కోర్టుకు వెళ్లి లొంగిపోయాడు. వారం రోజుల్లో లొంగిపోవాలని ఆశిష్‌ మిశ్రాను  సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన ఒక రోజు మిగిలి ఉండగానే ఆయన ధర్మాసనం ఎదుట లొంగిపోయారు. సోమవారం ఆశిష్‌ మిశ్ర బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపి.. బెయిల్ రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. వారంలోగా లొంగిపోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: