అక్షయ గోల్డ్ కుంభకోణం.. మొత్తం నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ స్కామ్‌లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు ప్రదర్శిస్తోంది. విశాఖపట్నం కోర్టులో ఈడీ తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. అక్షయ గోల్డ్ ఫామ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమిటెడ్, ఆ సంస్థ డైరెక్టర్లు భోగి సుబ్రహ్మణ్యం, దేవకి హరనాథ్ బాబు, ఎం.సుధాకర్ రావు తదితరులపై అభియోగాలను ఈడీ తాజాగా విశాఖ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టుకు సమర్పించింది.


ఈ స్కామ్‌పై ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర పోలీసులతో పాటు సీబీఐ ఒరిస్సా విభాగం కూడా అక్షయ గోల్డ్ పై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరిపాయి. ఆ దర్యాప్తు ఆధారంగా మనీలాండరింగ్ అంశాలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. అధిక వడ్డీ, స్థలాల పేరిట ఆశచూపి ఆర్బీఐ, సెబి అనుమతి లేకుండా లక్షల మంది నుంచి డబ్బులు వసూలు చేసి  మోసానికి పాల్పడినట్లు అక్షయ గోల్డ్ పై అభియోగాలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలోని 376 స్థిరాస్తులు సహా సుమారు 268 కోట్ల 24 లక్షల రూపాయల విలువైన ఆస్తులను ఈ కేసులోఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: