దేశంలో కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు వారి ఉద్యోగులపై ఫోకస్ చేస్తున్నాయి. కాగా, ఇటీవలే స్విగ్గీ, ఓయో లాంటి సంస్థలు తమ సిబ్బందికి వారానికి నాలుగు రోజులే పనిదినాలు కల్పించడమే కాకుండా ఉద్యోగులకు ఇన్సూరెన్స్, సెలవులు లాంటి సౌకర్యాలను కల్పించాయి. తాజాగా ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టీవీఎస్ కూడా ఈ జాబితాలో చేరింది. తన ఉద్యోగుల వార్షిక వేతనాలను మూడు రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఉద్యోగుల్లో ఎవరైనా కరోనాతో మరణిస్తే వారి కుటుంబానికి పరిహారం తో పాటు ఇద్దరు పిల్లలకు గ్రాడ్యుయేషన్ వరకు చదువు బాధ్యతను కూడా తీసుకుంది.

ఈ విషయాన్ని టీవీఎస్ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.బాధిత కుటుంబాలకు మూడేళ్ల పాటు వైద్య బీమా చెల్లిస్తామని టీవీఎస్ మోటార్ కంపెనీ హామీ ఇచ్చింది. అంతేకాకుండా ఉద్యోగులందరితో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా కోవిడ్ టీకాను అందజేయనున్నట్లు తెలిపింది. అయితే ఈ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుంది.. ప్రస్తుతం ఈ కంపెనీలో మొత్తం 35 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.

ఇది ఇలా ఉండగా ఇటీవలే ఓ ప్రముఖ కంపెనీ కూడా ఇలాంటి ఆఫర్ ను తమ ఉద్యోగులకు అందించింది. ఉద్యోగుల సంతానంలో ఇద్దరికి విద్యా సహాయంగా నెలకు రెండు లక్షల రూపాయలను రెండేళ్ల వరకు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా12వ తరగతి వరకు ఏడాదికి లక్ష రూపాయాలు, గ్రాడ్యూయేషన్ పూర్తయ్యే వరకు ఏడాదికి రూ.5 లక్షలు చెల్లించనున్నట్లు ప్రకటించింది. దిగ్గజ ఔషధ సంస్థ సన్ ఫార్మా, గ్లాస్వేర్ బ్రాండ్ బోరోసిల్ కూడా తన ఉద్యోగులకు మద్దతుగా ఇలాంటి సహాయ కార్యక్రమాలను ప్రారంభించాయి.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 37 లక్షల మంది కరోనా తో పోరాడుతున్నారు.. రికవరీ అవుతున్న వారి సంఖ్య తో పోలిస్తే మరణించేవారి సంఖ్య ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు పేర్కొన్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: