కావాల్సిన ప‌దార్థాలు:
టమాటాలు- ఒక క‌ప్పు
ముల్లంగి ముక్కలు- ఒక‌ కప్పు
పచ్చిమిర్చి- నాలుగు
సెనగపప్పు- ఒక టీ స్పూన్‌

 

మినప్పప్పు- ఒక టీ స్పూన్‌
కరివేపాకు- నాలుగు రెబ్బ‌లు
వెల్లుల్లి- నాలుగు రెబ్బలు

 

ఉప్పు- రుచికి స‌రిప‌డా
చింతపండు- నిమ్మ‌కాయంత‌
ఎండుమిర్చి- రెండు

 

జీలకర్ర- అర టీ స్పూన్‌
ఆవాలు- అర టీ స్పూన్‌
నూనె- త‌గినంత‌

 

తయారీ విధానం: ముందుగా ముల్లంగి ముక్కల్ని నీటిలో పదినిమిషాలు ఉడికించి పక్కన ఉంచండి. ఇప్పుడు పాన్‌లో నూనె వేడెక్కిన తరువాత పచ్చిమిర్చి, టమాటా ముక్క‌లు మ‌గ్గించుకోవాలి. ఇది దించేముందు చింతపండు కూడా వేసి రెండు నిమిషాల త‌ర్వాత స్టౌ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. ఇప్పుడు మ‌రో పాన్‌లో కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి, జీల‌క‌ర్ర‌, సెన‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు వేయించి తీసుకువాలి. 

 

ఇప్పుడు ఈ తాలింపు మిశ్ర‌మం మ‌రియు చాల్లార‌బెట్టుకున్న ట‌మాటా ముక్క‌లు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించిన ముల్లంగి ముక్కులు కూడా వేసి కచ్చాపచ్చాగా రుబ్బండి. ఇక చివ‌ర‌గా రుబ్బుకున్న మిశ్ర‌మానికి తాలింపు పెట్టుకుంటే స‌రిపోతుంది. అంటే టేస్టీ టేస్టీ టమాటా ముల్లంగి పచ్చడి రెడీ..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: