ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించింది. 2001లో కరీంనగర్ లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ సభ జరిగింది. పార్టీ ఆవిర్భవించి నేటికి 20 సంవత్సరాలైంది. సీఎం కేసీఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎదిగిన కొద్దీ ఒదుగుతూ ప్రతి ఎన్నికల్లోను ప్రజలు గులాబీ జెండాను అక్కున చేర్చుకునేలా చేశారు. సీఎం కేసీఆర్ కు ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏమిటంటే ఆయన వాగ్ధాటి. 
 
ఏ విషయాన్నైనా సూటిగా, స్పష్టంగా, ఎదుటి వాడిని మాట్లాడనివ్వకుండా చెప్పడం కేసీఆర్ లక్షణం. ఉద్యమ సారథి పాలనాధ్యక్షుడిగా సక్సెస్ అవుతాడా అనే ప్రశ్నకు కేసీఆర్ అవునని నిరూపించారు. స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకున్న కేసీఆర్ అదే స్పూర్తితో ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారు. అకుంఠిత దీక్షా దక్షతలతో.... తిరుగులేని సంక్షేమ పథకాలతో దేశమంతా తనవైపు తిప్పుకునేలా చేశారు కేసీఆర్. 
 
 
ఒక లక్ష్యం కోసం ఉద్యమాన్ని ప్రారంభించి ఆ లక్ష్యం ఫలితాన్ని కళ్లారా చూడటం కేసీఆర్ కు సాధ్యమైంది. గాంధేయవాదాన్ని నమ్మి ఉద్యమాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఏనాడు సహనం కోల్పోకుండా ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. 11 రోజుల ఆమరణ నిరాహార దీక్షతో స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చారు. ఉద్యమ సింహంగా 2014లో ఎన్నికల బరిలో దిగిన కేసీఆర్ కేవలం 63 స్థానాల్లో పార్టీని గెలిపించారు. 
 
తక్కువ స్థానాలే దక్కినా ప్రజాసంక్షేమ పాలన అందిస్తూ రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కు ఎదురులేని విధంగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి దాదాపు 400 సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేశారు. రాష్ట్రంలో 400కు పైగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారంటే కేసీఆర్ కు ప్రజల పట్ల ఉన్న మమకారం ఏంటో సులభంగానే అర్థమవుతుంది. పరిశ్రమలకు సకల సౌకర్యాలు కల్పిస్తూ రాయితీలను ప్రకటించడంతో అంతర్జాతీయ కంపెనీలు, సంస్థలు హైదరాబాద్ కు క్యూ కట్టాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: