జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు పెద్ద కుట్ర జరుగుతోందా ? అవుననే అంటున్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. కరోనా వైరస్ సంక్షోభంలో ప్రజల్లో ఆత్మస్ధైర్యం నింపేట్లుగా వ్యవహరించాల్సిన ప్రధాన ప్రతిపక్షం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటు మండిపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్దిపొందాలన్న ఉద్దేశ్యంతోనే ఎల్లోమీడియా ద్వారా ప్రభుత్వంపై బురద చల్లుతున్నట్లు సజ్జల తీవ్రంగా ఆరోపించారు. సజ్జల ఆరోపణల్లో కొంతవరకు నిజంలేకపోలేదు. చంద్రబాబునాయుడు అండ్ కో ప్రధానంగా టీకాలు, ఆక్సిజన్ కొరతపైనే రోజూ నానా యాగీ చేస్తున్నారు. 18 ఏళ్ళవాళ్ళకి వెంటనే టీకాలు వేయించటంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారంటు పదే పదే యువతను రెచ్చగొడుతున్నారు. దీన్ని ఎల్లోమీడియా బాగా హైలైట్ చేస్తోంది.




2019లో ఎదురైన ఘోర ఓటమిని చంద్రబాబు, ఎల్లోమీడియా మరచిపోలేకపోతున్నారు. దాంతో ఎలాగైనా జగనపై జనాల్లో ఎలాగైనా వ్యతిరేకత పెంచాలని చాలా ప్రయత్నాలే చేశారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగంకనబడలేదు. స్ధానికసంస్ధల ఎన్నికల్లో రిజల్టు వైసీపీకి అనుకూలంగా ఏకపక్షంగా వచ్చింది. దాంతో వీళ్ళకు మరింతగా మండిపోయింది. ఇలాంటి సమయంలోనే కరోనా సమస్య అందివచ్చింది వీళ్ళకు. ఇంకేముంది రోజువారి రెచ్చిపోతున్నారు. మామూలుగా జ్వరం వచ్చిన రోగిని ఎవరైనా పరామర్శించినపుడు మీకేం కాదు తొందరలోనే తగ్గిపోతుందని అంటారు. ఎందుకంటే రోగిలో ఆత్మస్ధైర్యం నింపడానికి. అంతేకానీ దీనికి విరుద్ధంగా రోగిని పరామర్శించిన  సమయంలోనే నీకు రోగం తగ్గదు ఎక్కువ కాలం బతకవని ఎవరైనా చెబుతారా ? ఇపుడు చంద్రబాబు చేస్తున్న పనిదే.




రాష్ట్రంలో కరోనా సమస్య పెరిగిపోతోంది, రోగులకు ఆక్సిజన్ అందటంలేదు. టీకాలు వేయించటం లేదు. ఆసుపత్రుల్లో బెడ్లు లేవు. రోజుకు వందల సంఖ్యలో రోగులు చనిపోతున్నారు. కర్నూలు కేంద్రంగా ఎన్ 440కే వేరియంట్ పుట్టేసింది. ఇంకేముంది కర్నూలంతా ఆగమాగమైపోతుందన్న పద్దతిలో  రోజూ గోల చేస్తున్నారు. నిజానికి టీకాలు, ఆక్సిజన్ అంశం కేంద్రం పరిధిలోనిది. వీటికి రాష్ట్రప్రభుత్వానికి సంబంధమేలేదు. అవసరమైన టీకాలు, ఆక్సిజన్ అందించమని కేంద్రాన్ని రిక్వెస్టు చేయటం తప్ప రాష్ట్రం చేయగలిగిందిలేదు. సుప్రింకోర్టు మార్గదర్శకాల తర్వాత రాష్ట్రంలో కూడా మూతపడిన కొన్ని ప్లాంట్లను తెరిపించి ఆక్సిజన్ ఉత్పత్తికి జగన్ చర్యలు తీసుకుంటున్నారు. చంద్రబాబు, లోకేష్  ఏమి మాట్లాడినా ఆవువ్యాసంలాగ చివరకు జగన్ పరిపాలనలో విఫలమయ్యారు, వెంటనే రాజీనామా చేసేయాలనే డిమాండే వినిపిస్తున్నారు. ఐదేళ్ళు పరిపాలించమని జనాలు తీర్పిచ్చిన తర్వాత మధ్యలో రాజీనామా చేయటానికి జగన్ ఏమన్నా అమాయకుడా ? ఇంతమాత్రం కూడా ఇంగితజ్ఞానం లేకుండా రాజీనామాకు ఎలా డిమాండ్ చేస్తున్నారో ?

మరింత సమాచారం తెలుసుకోండి: