సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభి చేసిన పరుష వ్యాఖ్యల కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. సీఎను పట్టుకుని పట్టాభి బోషడీకే.. అంటూ అనేక సార్లు ఆగ్రహంగా సంభోదిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం రాజకీయంగా కలకలం రేపింది. ఒక్కసారి కాదు.. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఆ పదం వాడినట్టు విన్న ఎవరికైనా అర్థం అవుతుంది. అందుకే దీన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. ఎక్కడి నుంచి ఆదేశాలు వెళ్లాయో గానీ.. ఏకంగా టీడీపీ కేంద్ర ఆఫీసుపైనే దాడి జరిగింది. ఈ దాడిపై వైసీపీ అధినేత జగన్ కూడా పెద్దగా పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు.


తమ నాయకుడిని అలాంటి మాటలు అంటే ఫ్యాన్స్‌కు బీపీ రావడం సహజం అన్నట్టు జగన్ మాట్లాడారు.  అంత వరకూ ఓకే.. కానీ.. అయితే దీన్ని టీడీపీ ఓ ఇష్యూగా తీసుకోవడం.. చంద్రబాబు దీక్షకు దిగడం.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి.. ఇలా అందరికీ ఉత్తరాలు రాయడం వల్ల విషయం ఫోకస్ అయ్యింది. దీంతో వైసీపీ కూడా ప్రెస్జీజ్‌ ఇష్యూగా తీసుకుంది. అసలు సీఎంను పట్టుకుని అంత మాట అంటారా అంటూ దాడి మొదలైంది. అందుకే అసలు ఆ పదం ఎంత పెద్దబూతో చెప్పేందుకు వైసీపీ నుంచి ప్రయత్నం జరిగింది.


అందులో భాగంగానే దాడి జరిగిన రోజే ప్రెస్ మీట్ పెట్టిన సజ్జల.. బోషడీకే అంటే ఏంటో తెలుసా.. అంటూ దొంగలం.. కొడుకు అంటూ క్లియర్‌గానే చెప్పేశారు. అంత వరకూ ఓకే.. తిట్టు తీవ్రత ఏంటో చెప్పడం కోసం అలా చెప్పారనుకుందాం.. కానీ.. ఆ డోస్ కూడా సరిపోనట్టు..  ఈసారి ఏకంగా సీఎం కూడా బోషడీకే అంటే అర్థం ఏంటో ఆయన నోటి నుంచే చెప్పారు. సాక్షాత్తూ సీఎం నోట అలాంటి పదం అందీ మీడియా అంతా ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని తెలిసినా ఆ లం.. కొడుకు అనే పదం అర్థం వివరించడం సమంజసంగా కనిపించడం లేదు.


సీఎంను తిట్టడాన్ని ఎవరూ స్వాగతించరు.. కానీ.. సీఎం పదవికి కూడా కొంత హుందాతనం ఉంటుంది కదా.. ఏకంగా సీఎం నోట అలాంటి మాట..ఏ ఉద్దేశంతో వచ్చినా వినడానికి ఇబ్బంది కరంగానే ఉంటుంది. అయితే తిట్టు తీవ్రత చెప్పడం కోసం జగన్ ఆ పని చేయాల్సి వచ్చిందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇంతకీ జగన్ చేసింది కరెక్టేనా..?

మరింత సమాచారం తెలుసుకోండి: