
రష్యా కూడా ఒకానొక అగ్రరాజ్యంగా అమెరికా తర్వాత పేరొందింది. ఒకప్పటి యూ ఎస్ ఎస్ ఆర్ కాస్త ఇప్పుడు రష్యాగా స్థిరపడింది. భారత దేశం వచ్చేసరికి రష్యాను మిత్ర దేశంగా భావిస్తూ వచ్చింది. అంతేకాకుండా 70%వరకు ఆయుధాలను అక్కడ నుంచే దిగుమతి చేసుకుంటుంది భారత్. కాంగ్రెస్ టైంలో కేవలం రష్యా నుండి మాత్రమే ఆయుధాలను దిగుమతి చేసుకునే వాళ్ళం. కానీ వాజ్పేయి సమయం నుంచి అమెరికాతో పాటుగా యూరప్ నుంచి కూడా కొనుగోలు చేయడం మొదలు పెట్టామని తెలుస్తుంది.
అమెరికా నాటో దేశాల సభ్యత్వం తీసుకోమని భారత్ ను ఎప్పటినుండో అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. కానీ భారత్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఒక నిలకడ ధోరణితో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు జర్మన్ రక్షణ మంత్రి భారత్ లో పర్యటిస్తున్న వేళ ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. భారత్ కు అత్యధిక మరియు అత్యాధునిక శక్తివంతమైన ఆయుధాలను ఇవ్వడానికి యూరప్ దేశాలు సిద్ధంగానే ఉన్నాయని ఆయన అన్నారు.
అయితే దీనికి భారత్ రష్యా గుప్పిట నుండి బయటకు రావడం లేదని, రష్యాను తప్ప వేరే దేశాన్ని వినియోగించుకోవడం లేదని అన్నారు. లేదంటే మరిన్ని శక్తివంతమైన ఆయుధాలు భారత్ కు అందగలవని ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే రష్యా అమెరికా యూరప్ దేశాలు ఇచ్చినటువంటి ఛాలెంజర్లు లాంటి శక్తివంతమైన ఆయుధాలను కూడా ధ్వంసం చేశారన్న విషయాన్ని ఇక్కడ మర్చిపోకూడదు.