ఇంజనీరింగ్ అంటే విద్యార్థులకు ఒక ఫ్యాషన్ అయిపోయింది.. ఎలా అంటే హ్యాపీ డేస్ సినిమా చూసినప్పటి నుంచి అందరూ అలా చదవాలని , ముఖ్యంగా అలాంటి లైఫ్ కావాలని అనుకుంటారు.. అయితే అలాంటి వారు ఇంజనీరింగ్ లో ఎటువంటి కోర్సులు తీసుకోవాలి అనే విషయాలను గురించి తెలియక సతమవుతుంటారు..ఇటీవల కరోనా కారణంగా మూతపడిన కాలేజీలు, స్కూల్స్ ఇప్పుడు తెరుచుకున్నాయి. పీజీ , ఎంసెట్ చేసే వారికి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు పూర్తయ్యాయి. కౌన్సిలింగ్ జరగనుంది. ఈ మేరకు విద్యార్థులు ఎటువంటి కోర్సులు తీసుకోవాలి అని ఆలోచిస్తుంటారు..



ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల సమయం వచ్చేసింది.. వచ్చే ఏడాది ఇంజనీరింగ్ కోర్సుల పై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం.. ఈ అత్యాధునిక టెక్నాలజీలకున్న ఆదరణ, విస్తృతి, ప్రయోజనాల దృష్ట్యా బీటెక్‌ స్థాయిలో ఎన్నో కళాశాలలు వీటిని ప్రవేశపెడుతున్నాయి.. ఇంజనీరింగ్ కు సంబందించిన ఉద్యోగాలలో కంపెనీ వాళ్ళు కొత్త మార్పులను తీసుకొచ్చారు. ముఖ్యంగా కంప్యూటర్‌ సైన్స్‌ రంగంలో ప్రాథమిక పరిజ్ఞానానికి బదులుగా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, డేటా సైన్స్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌లో నిర్దిష్ట నైపుణ్యం ఉన్నవారి వైపే నియామక సంస్థలు మొగ్గు చూపుతున్నాయి..



ఇకపోతే ఇంజనీరింగ్ లో కేవలం కంప్యూటర్ కోర్సులు మాత్రమే కాకుండా వివిధ రకాల కోర్సులు కూడా ఉన్నాయి.. ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌, కెమికల్‌, బయోమెడికల్‌, ఫార్మాస్యూటికల్‌ తదితర అన్ని ఇంజినీరింగ్‌ విభాగాల్లోనూ ఈ సాంకేతికతలు అంతర్గతంగా ఉండి, ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాలతోపాటు ఈ ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని జోడించడం ద్వారా స్వయంచాలక వాహనాలు, ఎలక్ట్రికల్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్స్‌, కెమికల్‌ ప్రాసెస్‌ పరిశ్రమలు, సమర్థ వ్యవసాయం వంటి ఏఐ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి సాధ్యమవుతుంది...సాంకేతిక నైపుణ్యం మీద ఈ విద్య ఆధారపడి ఉంటుంది. అందుకే వీటి పై కొద్దిగా అయినా అవగాహన ఉండాలని నిపుణులు అంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: