పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రపంచాన్ని అరచేతిలో చూపించే మొబైల్స్ వచ్చాయి. వీటి ద్వారా ఇంట్లో నుండి  కాలు బయట పెట్టకుండానే మన పనులు చక్క బెట్టుకు నే అవకాశం కలుగుతోంది. ఇంతకు ముందు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళితే అక్కడ చెక్ చేయించుకుంటే ఆ తర్వాత రిపోర్ట్స్ రావడానికి కొద్ది రోజులు వేచి చూడాల్సి  వచ్చేది. కానీ టెక్నాలజీ  ఇప్పుడు ఇబ్బందులకు చెక్ పెట్టింది.



 మార్కెట్ లోకీ కొత్తగా వచ్చే హెల్త్ అప్స్ తో మనం క్షణాల్లో అన్నీ తెలుసుకునే సౌలభ్యం ఏర్పడింది. ఈ సెల్ యాప్స్ టీనేజీ యువతరం విపరీతంగా ఉపయోగిస్తున్నారు. వీటి ద్వారా తన ఫిట్నెస్, బరువు, వంటి వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అయితే ఈ ఫిటినెస్ ఆప్స్ డయాబెటిస్ రోగులకు కూడా ఉపయోగపడుతున్నాయి. వారికి వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. టెక్నాలజీ అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణకు కూడా మార్గం చూపిస్తుందని హెల్త్ అప్స్
తో చాలామంది వారి ఆరోగ్య స్థితులు రోగనిర్ధారణ వంటి వాటిని సులభంగా ట్రాక్ చేయగలుగుతున్నాను అధ్యయనం స్పష్టం చేసింది.


 అయితే ఈ అధ్యయనం 1,070 మంది డయాబెటిస్ రోగుల పై మూడు నెలల పాటు అధ్యయనం కొనసాగింది.  వీరిలో కొంతమంది మొబైల్ హెల్త్ యాప్ యోగించగా మరికొంతమంది ఉపయోగించలేదు.  మొబైల్ హెల్త్ అప్స్ ఉపయోగించని వారితో పోలిస్తే ఉపయోగించే డయాబెటిక్ రోగులకు మెరుగైన ఆరోగ్య ఫలితాలు కలిగి ఉన్నారని అధ్యాయంలో తెలింది. అంతేకాక వీటిని ఉపయోగించే డయాబెటిస్ రోగులు త్వరగా కోలుకున్నారని, వారి వైద్య ఖర్చులు కూడా తగ్గించుకున్నారని అధ్యయనం తేల్చిచెప్పింది.


హెల్త్ అప్స్ ద్వారా క్షణాల్లో ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యాన్ని ట్రాక్ చేయగలిగే అవకాశం ఉందని వైద్య ఖర్చులు తగ్గడానికి ప్రధాన కారణమని వైద్యులు తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలు మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం రీసెర్చ్ సెంట్రల్ పబ్లికేషన్ చెందిన క్వాటర్లీ జెనరల్ ప్రచురించబడ్డాయి. ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా వారి జీవనశైలి మార్చుకుంటారు. డయాబెటిస్ వంటి రోగాల నుంచి బయటపడగలదు అని బీ బీ లి మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: