ప్ర‌స్దుతం దేశం మొత్తం క‌రోనా కోర‌ల్లో విల‌విలలాడుతోంది. దీని దెబ్బ‌కు ఇప్ప‌టికే ల‌క్ష‌ల‌మంది ప్రాణాలో కోల్పోయారు. ఇంకా చాలామంది ఆస్ప‌త్రుల్లోనే ఉంటున్నారు. అయితే దీన్ని ఎదుర్కోవ‌డానికి ఇప్ప‌టికే చాలా ర‌కాల మందులు అందుబాటులోకి వ‌చ్చాయి. దీంతో కొంత‌లో కొంత రిలీఫ్ ఉంటుంది పేషెంట్ల‌కు. అయితే ఇప్పుడు మ‌రో కొత్త ర‌కం మందు అందుబాటులోకి వ‌చ్చింది అదేంటో ఇప్పుడు చూద్దాం.
 
ఆరోగ్య, వినియోగ వస్తువుల ఉత్పత్తుల రంగంలో మంచి గుర్తింపు పొంది.  శ్రీశ్రీ త‌త్వ క‌రోనా బాధితుల కోసం ఆయుష్‌-64 అనే కొత్త మందును విడుదలచేసింది. ట్యాబ్లెట్ల రూపంలో లభించే ఈ మెడి సిన్ ను కరోనా ప్రారంభ, మధ్యమ ద‌శ‌లో ఉన్నవారిపై ప్రభావవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. దీనికి ఆయుష్‌ మంత్రిత్వశాఖ గుర్తింపు ఇచ్చింద‌ని స‌ద‌రు సంస్థ తెలిపింది.

ఇక దేశవ్యాప్తంగా ఏడుచోట్ల నిర్వహించిన క్లినికల్‌ట్రయల్స్‌లో ఈ మెడిసిన్ కరోనా మొద‌టి,  మధ్య స్థాయిల్లో ఉన్న పేషెంట్ల‌కు మంచి ఉపశమనం కలిగించింద‌ని తెలిసింది. ఇక ఆయుష్‌-64 మందుపై అంతర్గతంగా జరిపిన 36 క్ల‌నిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో 35 సార్లు ఈ మందు కరోనాను ప్రభావవంతంగా ఎదుర్కొంది. కాగా ఆయుష్‌ మంత్రిత్వశాఖ కార్యదర్శి పద్మశ్రీ వైద్య రాజేశ్‌ కొటేచా  ఈమందును శ్రీశ్రీతత్వ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్ అయిన అర్వింద్‌ వర్చస్వి తో పాటు అఖిల భారత ఆయుర్వేద కాంగ్రెస్‌ అధ్యక్షుడు అయిన డాక్ట‌ర్ దేవేంద్ర త్రిగుణ ఆధ్వ‌ర్యంలో ఈమందు ఆయుష్‌-64ను విడుద‌ల చేశారు.

ఈ ప్రోగ్రామ్‌లో యూజీసీ మాజీ వైస్‌ చైర్మన్‌ భూషణ్‌ పట్వర్ధన్ తో పాటు కేంద్ర ఆయుర్వేద వైద్య విజ్ఞాన సమాఖ్య డైరెక్టర్‌ జనరల్ అయిన ఎన్‌.శ్రీకాంత్‌, ఆయుర్వేద ఆస్ప‌త్రుల వ్యవస్థాపకుడు అయిన రాజీవ్‌ వాసుదేవన్ ముఖ్య అతిథులుగా వ‌చ్చారు. అలాఏ ఎంజీ సహ వ్యవస్థాపకుడు అయిన వికాస చౌహాన్ ఈ కార్య‌క్ర‌మానిక వ‌చ్చి ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాడు. దీన్ని అంద‌రికీ అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: