మన దేశంలో షుగర్ పేషెంట్స్ లెక్క సుమారు 7 కోట్లకు చేరిందని అంచనా. సాధారణంగా షుగర్ ని చక్కెర వ్యాధి అని కూడా అంటారు.. షుగర్ ఎక్కువగా తినడం వల్ల వస్తుందని అనుకుంటారు. కాని అది కేవలం వారి అపోహ మాత్రమే. శరీరంలో సరైన మోతాదులో ఇన్సులిన్ విడుదల కాకపోవడమే ఈ వ్యాధికి ప్రధాన కారణం. ఇన్సులిన్ అనేది శరీరంలోని షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. అప్పుడే చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి.ఒకవేళ ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఎప్పుడైతే తగ్గుతుందో.. చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఫలితంగా అధిక బరువు, ఊబకాయం, నరాల వీకెనెస్ వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉండేందుకు మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్ లెవెల్స్‌ను ఎప్పుడూ కంట్రోల్‌లో పెట్టుకోవడంపై దృష్టి సారించాలి. శరీరంలోని చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు కనిపిస్తే.. కచ్చితంగా అవయవాల డ్యామేజ్, ప్రాణాంతక సమస్యలు దారి తీసే అవకాశం ఉంటుంది. టైంకు పడుకోవడం, కంటికి సరపడా నిద్ర ఉంటేనే మనం ఎలప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటాం. ఇదే వైద్య నిపుణులు ఇచ్చే సూచన. ఇక తగినంత నిద్ర ఉంటేనే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.


ఎప్పటికప్పుడు మీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా చేయడం ద్వారా మీరు అవసరమైనప్పుడల్లా డైట్ లేదా మెడికేషన్‌లో మార్పులు చేర్పులు చేయవచ్చు. తద్వారా మీ శరీరంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంటాయి.యోగా లేదా ఇతర వ్యాయామాల ద్వారా మీ ఒత్తిడిని తగ్గించుకుంటూ ఉండాలి. అలా చేయడం ద్వారా మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మనం ఎలప్పుడూ హైడ్రేటడ్‌గా ఉంటాం. అలా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువ అవ్వడంతో పాటు డయాబెటిస్ వ్యాధి ప్రమాదం కూడా తగ్గుతుంది.


మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా మంచి నీరు లేదా జీరో క్యాలరీ పానీయాలు తాగడం ఆరోగ్యానికి మంచిది.ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను పుష్కలంగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి.కార్బోహైడ్రేటడ్ ఫుడ్స్ మీ రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపిస్తుంది. వైట్ కార్బోహైడ్రేట్స్‌లో పోషక విలువలు తక్కువగా ఉంటాయి.ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి, బరువు పెరగడానికి కారణమవుతాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు పిండి పదార్ధాలను తక్కువగా తీసుకోవాలి.అప్పుడే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంటాయి.క్రమం తప్పకుండా వ్యాయాయం చేయడం ద్వారా మీరు తగిన బరువును మైంటైన్ చేయడమే కాకుండా.. ఇన్సులిన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. తద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: