
అయితే అందరికీ కోడి గుడ్లు తినడం మంచిదా..? అంటే నో అని అంటున్నారు డాక్టర్లు. కొన్ని సమస్యలు ఉన్నవాళ్లు కోడిగుడ్లు తినకపోవడం బెటర్ అంటూ సజెస్ట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉండే వాళ్ళు కోడి గుడ్లు తినకపోవడమే బెటర్ అంటున్నారు డాక్టర్లు. మూత్రపిండాలకు సంబంధించిన ఏదైనా సమస్య ఉండేవాళ్లు గుడ్లు తినకూడదు. వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే కోడి గుడ్డను తీసుకోవాలి . అది కూడా వాళ్ళు చెప్పిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి . ఎందుకంటే అందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది . దీని కారణంగా మూత్రపిండాలపై ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది . అంతేకాదు అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికి కోడిగుడ్డు పెద్ద పెద్ద శత్రువు .
గుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి గుడ్డు వినియోగం కొలెస్ట్రాలను ఇంకా పెంచేస్తుంది . మరీ ముఖ్యంగా ఎలర్జీ ఉన్నవాళ్లు గుడ్లు అస్సలు తినకూడదు . గుడ్లు తిన్న తర్వాత ఎవరికైనా సాధారణంగా కొంచెం కడుపు నొప్పి.. వికారం ఉంతే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి. అంతే కాదు స్కిన్ అలర్జీ ఉన్న వాళ్లు కూడా కోడిగుడ్లు తినకపోవడం బెటర్ అంటున్నారు డాక్టర్లు . సరైన డాక్టర్ ని సంప్రదించిన తర్వాత మాత్రమే కోడిగుడ్లను తినాలి . అంతేకాదు ఎవరైనా ఉబయ కాయంతో బాధపడుతూ ఉంటే గుడ్లను అస్సలు తినొద్దు. వాళ్ల బరువు ఇంకా ఇంకా పెరిగిపోతుంది అంటూ డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే . నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రిత్య ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా వైద్య నిప్పుణులను సంప్రదించడం చాలా ఉత్తమం)