జూన్ 30వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళితే ఎన్నో ముఖ్య  సంఘటనలు  ఎంతో మంది ప్రముఖుల జననాలు ఎంతో  మంది ప్రముఖుల మరణాలు జరిగాయి.  మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు సంభవించిన మరణాలు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి. 


 జె వి  సోమయాజులు జననం  : రంగస్థల సినిమా బుల్లితెర నటుడు అయిన  జె.వి.సోమయాజులు 1928 జూన్ 30వ తేదీన జన్మించారు. ముఖ్యంగా శంకరాభరణం అనే సినిమా ద్వారా శంకర శాస్త్రి గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటుడు జెవి సోమయాజులు. రంగస్థలం వెండితెర బుల్లితెర వంటి మాధ్యమాలు  అన్నింటిలో కూడా తన నటనతో ప్రేక్షకులను అలరించారు, స్వయంకృషితోనే తన ప్రస్థానాన్ని ప్రారంభించిన జె.వి.సోమయాజులు.. క్రమక్రమంగా  నిబద్ధతతో నాటకరంగానికి అంకితమయ్యారు. శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రి పాత్రలో ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు ఈయన. దర్శకుడు బాపు తెరకెక్కించిన ఎన్నో సినిమాల్లో నటించి ఆయన నటనతో  తెలుగు ప్రేక్షకులందరికీ మరుపురాని అనుభూతిని ఇచ్చారు.

 


 చింతామణి నాగేశ రామచంద్ర రావు జననం : ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త భారతరత్న పురస్కార గ్రహీత ప్రొఫెసర్ చింతామణి నాగేశ రామచంద్ర రావు 1934 జూన్ 30వ తేదీన జన్మించారు, ఈయన  రసాయన శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసి అనేక అంశాలను వెలుగులోకి తీసుకువచ్చారు. ఏకంగా 60 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు రామచంద్ర రావు. సివి రామన్, అబ్దుల్ కలాం తర్వాత భారత రత్న అవార్డుకు ఎంపికైన మూడో శాస్త్రవేత్త చింతామణి నాగేశ రామచంద్ర రావు.

 


 తమ్మారెడ్డి భరద్వాజ  జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత దర్శకులు అయిన తమ్మారెడ్డి భరద్వాజ 1948 జూన్ 30వ తేదీన జన్మించారు. ఈయన  తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న తమ్మారెడ్డి గోపాల కృష్ణ కుమారుడు. దర్శకుడిగా ఎన్నో సినిమాలను తెరకెక్కించి ఎంతో గుర్తింపు  సంపాదించారు . తమ్మారెడ్డి భరద్వాజ తెరకెక్కించిన ఎన్నో సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి.  అంతే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలను నిర్మించి మంచి విజయం సాధించారు అని చెప్పాలి. ఇక ఈయన దర్శకత్వం వహించిన పోతే పోనీ సినిమాకి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు సైతం అందుకున్నాడు తమ్మారెడ్డి భరద్వాజ.

 

 అల్లరి నరేష్ జననం : తెలుగు సినిమా దర్శకుడు అయిన ఇవివి సత్యనారాయణ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు అల్లరి సినిమాతో హీరోగా పరిచయమైన నరేష్  తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ సుపరిచితులే. తన మొదటి చిత్రమే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ముఖ్యంగా హాస్య ప్రధానమైన చిత్రంలో తనదైన కామెడీ టైమింగ్ తో అద్భుతంగా తెలుగు ప్రేక్షకులను నవ్వించారు అల్లరినరేష్.  తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో హాస్యభరితమైన సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అందరికీ మరింత దగ్గరయ్యాడు. ఎన్నో  వైవిధ్యమైన పాత్రల్లో కూడా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు అల్లరినరేష్.

 

 సుత్తి వీరభద్ర రావు మరణం  : సుత్తి వీరభద్ర రావు గా ఎంతగానో ప్రసిద్ధి గాంచిన మామిడిపల్లి వీరభద్ర రావు 1988 జూన్ 30వ తేదీన మరణించారు. రేడియో నాటక కళాకారుడిగా తెలుగు ప్రేక్షకులందరికీ ఈయన  సుపరిచితులు. ఇక ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు సంపాదించారు వీరభద్రరావు.


 దాదాబాయి నౌరోజి మరణం : పార్సీ మతానికి చెందిన విద్యావేత్తల మేధావి పత్తి వ్యాపారి అయిన దాదాబాయి నౌరోజి 1915 జూన్ 30వ తేదీన మరణించాడు. ఈయన  తొలితరం రాజకీయ సామాజిక నాయకుడు. 1892 నుంచి 1895 వరకు పార్లమెంటు సభ్యుడిగా యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో  కొనసాగారు. ఇలాంటి గౌరవం పొందిన మొదటి ఆసియా వ్యక్తి దాదాబాయ్ నౌరోజీ.

 

 రాయప్రోలు సుబ్బారావు : తెలుగుభాష కవిత్వానికి ఆద్యుడు అయిన  రాయప్రోలు సుబ్బారావు 1984 జూన్ 30వ తేదీన మరణించారు. ఈయన రాసిన తృణకంకణము తో తెలుగు కవిత్వంలో నూతన శకం ఆరంభమైంది అంటూ ఉంటారు, ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు అని చెబుతూ ఉంటారు. ప్రేమ పెళ్లికి దారితీయును యువతీ యువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తంతో ఖండకావ్య అనే రచనకు అంకురార్పణ చేశారు రాయప్రోలు సుబ్బారావు.కళాకారుని ఊహలు భావాలు సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత ఈయన రచనలలో కనిపిస్తూ ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి: