ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా యువ‌త‌కు జీన్స్ వాడ‌డం ఓ ప్యాష‌న్‌. జీన్స్ లేనిదే యువ‌త డ్రెస్సులు వేసుకునే ప‌రిస్థితి లేదు. ర‌క‌ర‌కాల ఫ్యాష‌న్ జీన్స్‌కు మ‌నోళ్లు అలవాటు ప‌డిపోయారు. ఇక జీన్స్ అన‌గానే మ‌న‌కు ఆలీ హీరోగా వ‌చ్చిన య‌మ‌లీల సినిమాలోని నీ జీనూ ప్యాంటూ చూసి బుల్లమ్మో.. నీ సైకిల్ చైనా చూసి పిల్లోడా అన్న సాంగ్ గుర్తుకు రాక మాన‌దు. అంటే ఎప్పుడో రెండున్న‌ర ద‌శాబ్దాల పైనుంచే ఈ జీన్ అనేది ట్రెండింగ్‌... నాటి నేటి వ‌ర‌కు ఫ్యాష‌న్ల ప‌రంగా ఎన్ని కొత్త ట్రెండ్స్ వ‌చ్చినా జీన్స్ ట్రెండే వేరు.


ఒకప్పుడు.. మగవారు మాత్రమే ఈ జీన్స్‌లను ధరించేవారు. కానీ.. ఇప్పుడు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. అందరూ ఈ జీన్స్‌ని వాడుతున్నారు. అందులోనూ.. ఈ జీన్స్ సౌకర్యవంతంగా ఉండటంతో.. దీని వాడకానికి అసలు అద్దూహడుపు లేదు. ఇదిలా ఉంటే ఈ జీన్స్ వ‌ల్ల భ‌యంక‌ర‌మైన చ‌ర్మ వ్యాధులు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ట‌. ఇప్పుడు ఈ విష‌యం అంద‌రిని తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.


ఒక్క జీన్స్‌నే కాదు.. టైట్‌ ఫిటింగ్స్‌, లెగ్గిన్స్‌ వంటి వాటిని.. ముఖ్యంగా యువత బాగా వాడుతున్నారు. వీటిని ఎక్కువుగా వాడితే స్కిన్ ఎలర్జీస్ రావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. తామర, శోబి వంటి వ్యాధులు వీటి వ‌ల్ల యువ‌త‌లో ఎక్కువుగా వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. జీన్స్, సిల్క్, సింథటిక్ బట్టలు వాడే ప్రతి వంద మందిలో.. పది మంది చర్మ వ్యాధులతో తమ వద్దకు వస్తున్నారని ఈ విష‌యాన్ని బ‌య‌ట పెట్టిన వైద్యులు చెపుతున్నారు.


జీన్స్.. చెమట పీల్చుకోకపోవడం.. గాలి చొరబడనివ్వకపోవడం వంటి కారణాల వల్ల ఫంగస్‌ ఏర్పడి.. స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయట. ఇక టైట్ ఫిట్లు వాడడం వ‌ల్ల ర‌క్త ప్ర‌స‌ర‌ణ జ‌ర‌గ‌క అక్క‌డ‌ కొవ్వు ఏర్పడి లావు అవుతున్న‌ట్టు ప‌రిశోధ‌కులు చెపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: