ప్రస్తుతం మారుతున్న జీవన శైలికి ప్రతి ఒక్కరూ అలవాటు పడడం వల్ల.. ఇష్టానుసారం పద్ధతిలో ప్రతి ఒక్కటి వండుకొని తింటూ ఉంటున్నాము..ఇందువల్ల అనేక నష్టాలే కాకుండా ఎటువంటి లాభాలు కూడా ఉండవు. ముఖ్యంగా అన్నం వండటానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు మనం పూర్వం నుంచి వస్తూ ఉన్నాయి. అయితే వాటిని పాటించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ముఖ్యంగా అన్నం వండేటప్పుడు బియ్యాన్ని ఎందుకు నాన్న పెట్టాలో అనే విషయాన్ని కచ్చితంగా ఇప్పుడు తెలుసుకోవాలి. దీని వెనక సైన్స్ ఏం చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


బియ్యం వండడానికి ముందు నానబెట్టడం వల్ల పలు పోషకాలు సమగ్ర పరచడానికి సహాయపడతాయట. అంతేకాకుండా జీర్ణం కావడానికి సహాయపడడమే కాకుండా మన శరీరంలో ఉండే ప్రేగులు ఆరోగ్యంగా ఉంచడానికి చాలా సహాయపడుతాయి. బియ్యం నీటిని గ్రహించి వేడి తగలగానే తొందరగా ఉడికే గుణంగా మారిపోతుంది..ముఖ్యంగా బియ్యంలో ఉండే విటమిన్లు ఖనిజాలు గ్రహించడం లో చాలా ప్రభావితం చేస్తాయి. అయితే నానబెట్టిన బియ్యం ఉడికించినప్పుడు అన్నం చాలా త్వరగా మృదువుగా తయారవుతుంది. నానబెట్టి బియ్యాన్ని వండడం వల్ల ప్రక్రియ కూడా చాలా తొందరగా జరుగుతుంది.


బియ్యం నానబెట్టడం వల్ల విత్తనాలలో కనిపించే ఫైటిక్ తొలగిపోతుంది. అందువల్ల మన శరీరానికి జింక్ క్యాల్షియం వంటి పోషకాలు గ్రహించబడతాయి. అందుచేతనే బియ్యం నానబెట్టి వండుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే బాస్మతి రైస్ వంటి వాటిని కేవలం 15 నుంచి 20 నిమిషాలు నానబెడితే చాలు ఇక మిగిలిన బియ్యాన్ని అన్నం వండుకునేటప్పుడు ఒక గంట ముందు నానబెడితే చాలని కొంతమంది వైద్యులు తెలియజేస్తున్నారు. అందుచేతనే ప్రతి ఒక్కరు కూడా బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగి నానబెట్టడం మంచిది. ఇక బియ్యం వంచిన గంజి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: