ఒక కొత్త హీరో మొదటి సినిమాకు 100 కోట్ల కలక్షన్స్ రావడం సాధారణమైన విషయం కాదు. అలాంటి అదృష్టం ‘ఉప్పెన’ మూవీతో వైష్ణవ్ తేజ్ కు దక్కింది. దీనితో ఇండస్ట్రీలోని అనేకమంది నిర్మాతలు దర్శకుల దృష్టి వైష్ణవ్ తేజ్ పై పడింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈయంగ్ హీరో అనుసరిస్తున్న తీరు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.



వైష్ణవ్ తేజ్ పూర్తి చేసిన ‘కొండపాలెం’ మూవీ వచ్చేవారం విడుదల కాబోతోంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈమూవీ చాల సహజంగా ఆదివాసీల జీవితాలను కళ్ళకు కట్టే విధంగా ఉంటుందని సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ రచయిత వ్రాసిన ‘కొండపాలెం’ నవలకు ఇది సినిమా అనుసరణ. అయితే ఇలాంటి కథలు యూత్ కు ఎంతవరకు నచ్చుతాయి అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.



మూవీ తరువాత ప్రముఖ తమిళ దర్శకుడు తెలుగులో తీసే ఒక మూవీలో వైష్ణవ్ తేజ్ నటించబోతున్నాడు. ఈమూవీ తరువాత ఈయంగ్ హీరో నటించవలసిన సినిమాల ఎంపికలో కన్ఫ్యూజన్ కొనసాగుతున్నట్లు టాక్. దీనికి కారణం ఈ యంగ్ హీరో ఆలోచనలు అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మెగా మేనల్లుడు తనదగ్గరకు కథలతో వస్తున్న యంగ్ డైరెక్టర్లు చెప్పే కథలు ఆశక్తి కనపరచడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.



తాను భవిష్యత్ లో నటించబోయే సినిమాలకు టాప్ డైరెక్టర్స్ దర్శకత్వం వహిస్తేనే బాగుంటుందని ఈ యంగ్ హీరో తనను కలుస్తున్న నిర్మాతలతో చెపుతున్నట్లు టాక్. ఒకవైపు నాగార్జున విజయ్ దేవరకొండ నాని లాంటి హీరోలు అనేకమంది యంగ్ డైరెక్టర్స్ కు అవకాశాలు ఇస్తూ ఉంటే వైష్ణవ్ తేజ్ ఇలాంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో సాయి ధరమ్ తేజ్ కూడ ఇలా ఎప్పుడు ప్రవర్తించలేదని అలాంటిది అదే కుటుంబం నుండి వచ్చిన ఈ యంగ్ హీరోకి ఇలాంటి ఆలోచనలు ఏమిటి అంటూ ఇండస్ట్రీలోని కొందరు ఆశ్చర్య పడుతున్నట్లు టాక్..  








మరింత సమాచారం తెలుసుకోండి: