తెలుగు సినిమాలలో కథ కథనం కంటే ఎక్కువగా ప్రేక్షకులపై ప్రభావం చూపించేవి సంభాషణలు.  ఒక కథను రాసుకున్నప్పుడు దానికి సంబంధించిన సంభాషణలు కూడా అదిరిపోయేలా రాసుకుంటూ ఉంటారు మన మేకర్స్. అలా సాధారణ ప్రేక్షకులను అలరించడం కోసం మన దర్శక నిర్మాతలు కథ-స్క్రీన్ ప్లే ఏవిధంగానైతే పకడ్బందీగా సిద్ధం చేసుకుంటారో సంభాషణల విషయంలో కూడా ప్రేక్షకులను అలరించేలా రాసుకుంటారు.

అలా కొండ పొలం సినిమాలో సంభాషణలు ప్రేక్షకులను ఎంతో ఉత్తేజపరిచేలా ఆలోచింపజేసేలా రాశారు అనడంలో ఏ విధమైన సందేహం లేదు. ఈ సినిమాకి నవల రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి సంభాషణలు అందించగా ప్రతి పాత్రలో ఆయన అద్భుతమైన డైలాగులు పలికించి ఆ పాత్రకు జీవం పోశారు. ఆ పాత్రల ప్రవర్తన,  ఆహార వ్యవహారాలు అంతా పోత పోసినట్టుగా ఉంది అంటే సంభాషణల విషయంలో వారు ఎంత గా పని చేశారో అర్థం చేసుకోవచ్చు.

అడవిని అమ్మ గా భావించమని చెప్పే కొన్ని కొన్ని డైలాగ్స్ ప్రతి ఒక్కరిని ఎంతగానో అలోచింపేలా చేస్తాయి. పశువుల ను సొంత బిడ్డలా చుసుకుని వాటిని తమ కుటుంబ సభ్యులలాగా చూసుకోవాలని చెప్పే కొన్ని డైలాగులు కూడా అందరినీ హత్తు కున్నాయి.  ఈ నేపథ్యంలో ఇలాంటి ఎన్ని మంచి మంచి డైలాగ్స్ తో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఒక స్థాయి వరకు బాగానే మెప్పించిన కూడా ఇంకొక స్థాయిలో ప్రేక్షకులకు బోర్ కొట్టించింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. సంభాషణలు ఒకటే బాగుంటే సినిమా హిట్ అయినట్టు కాదు స్క్రీన్ ప్లే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దానిపై కొంత శ్రద్ధ వహిస్తే ఈ సినిమాకు తిరుగులేదు అనేది కొందరి మాట. మేకింగ్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సినిమాను ఎంతో రిచ్ గా తెరకెక్కించారు దర్శకుడు క్రిష్.  సెకండాఫ్ లో ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ చాలా డ్రాప్ అయిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రేక్షకులను భవిష్యత్తులో ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: